వాళ్లు కచ్ఛితంగా విరాట్ కోహ్లీని ఇబ్బంది పెడతారు... మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్...

Published : Jun 15, 2021, 03:54 PM IST

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం టీమిండియా సమాయత్తమవుతోంది. జూన్ 18 నుంచి ప్రారంభమయ్యే ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టుపైన కూడా భారీ ఆశలే ఉన్నాయి. అయితే ఇంగ్లాండ్ పిచ్, వాతావరణం, అనుభవం దృష్ట్యా న్యూజిలాండ్‌కే విజయావకాశాలు ఎక్కువని టాక్ వినిపిస్తోంది.

PREV
19
వాళ్లు కచ్ఛితంగా విరాట్ కోహ్లీని ఇబ్బంది పెడతారు... మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్...

న్యూజిలాండ్, ఇప్పటికే ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులు ఆడి, ఓ మ్యాచ్ గెలిచి సిరీస్ కూడా సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టిన న్యూజిలాండ్ బౌలర్ల నుంచి భారత సారథి విరాట్ కోహ్లీకి ముప్పు తప్పదని అంటున్నాడు మాజీ క్రికెటర్, వికెట్ కీపర్ పార్థివ్ పటేల్.

29

‘విరాట్ కోహ్లీకి ఇప్పుడు చాలా సమయం ఉంది. అతను 2014 ఇంగ్లాండ్ పర్యటనలో పెద్దగా రాణించలేకపోయాడు. అయితే 2018లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు, సెంచరీలు కూడా చేశాడు.

39

ఇప్పుడు న్యూజిలాండ్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి అతను 2018లో సిద్ధమైనట్టుగా మానసికంగా రెఢీగా ఉండాలి. ఎందుకంటే కివీస్ బౌలింగ్ విభాగంలో చాలా వెరైటీ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు.

49

న్యూజిలాండ్ బౌలింగ్ ఒకేలా ఉండదు. ఒక్కో బౌలర్, ఒక్కో విధంగా బౌలింగ్‌లో మార్పులు చేస్తూ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలరు. కాబట్టి విరాట్ వీటికి సిద్ధంగా ఉండాలి...’ అంటూ చెప్పుకొచ్చాడు పార్థివ్ పటేల్.

59

2014 టూర్‌లో కేవలం 13.40 యావరేజ్‌తో 134 పరుగులు మాత్రమే చేయగలిగిన విరాట్ కోహ్లీ, నాలుగేళ్ల తర్వాత ఐదు టెస్టుల సిరీస్‌లో 593 పరుగులు చేసి అదరగొట్టాడు...

69

ఇందులో రెండు భారీ సెంచరీలు కూడా ఉన్నాయి. సౌంతిప్టన్‌లో న్యూజిలాండ్‌ను ఓడించాలంటే విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్‌లు రావాలని అంటున్నాడు పార్థివ్ పటేల్...

79

‘విరాట్ కోహ్లీ ఇప్పుడు సహనం ప్రదర్శించాలి. వీలైనన్ని ఎక్కువ బంతులను వదిలేస్తూ, సాధ్యమైనంత సేపు క్రీజులో ఉండడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే ఎంత ఎక్కువసేపు క్రీజులో ఉంటే, ఎక్కువ పరుగులు చేయడానికి అంత ఎక్కువ అవకాశం దొరుకుతుంది...

89

2014లో విరాట్ కోహ్లీ పరుగులు చేయలేకపోయాడు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్‌తో చాలా సమయం గడిపాడు. చాలా విషయాలు నేర్చుకున్నాడు. 2018లో పరుగులు చేశాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.

99

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో విరాట్ కోహ్లీ చేసే పరుగులను బట్టి, అతని ఫ్యూచర్ ఆధారపడి ఉంటుందని అంటున్నారు చాలామంది క్రికెట్ విశ్లేషకులు. ఒకవేళ ఫైనల్‌లో మ్యాచ్ ఓడిపోయి, కోహ్లీ పరుగులు చేయలేకపోతే అతను కెప్టెన్సీ నుంచి తప్పుకోవచ్చని కూడా టాక్ నడుస్తోంది.

click me!

Recommended Stories