ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లాండ్ జట్టును తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకి ఆలౌట్ చేసిన భారత జట్టు, రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 8 పరుగుల ఆధిక్యంలో నిలిచింది...
ఓవర్‌నైట్ స్కోర్ 125/4 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకి మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. మూడో రోజు రెండు ఓవర్లు కూడా పూర్తికాకుండా వర్షం రావడంతో కాసేపు ఆట నిలిచిపోయింది...
28
బ్రేక్ తర్వాత ఆట తిరిగి ప్రారంభమైనా మరోసారి వర్షం పలకరించింది. అయితే ఆటను అలాగే కొనసాగించారు అంపైర్లు. వారి నిర్ణయానికి తగ్గట్టుగానే వర్షం కొద్దిసేపటికే ఆగిపోయింది...
38
తన స్టైల్‌కి తగ్గట్టుగానే 20 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్, రాబిన్‌సన్ ఓవర్‌లో బెయిర్ స్టోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
48
కెఎల్ రాహుల్ వికెట్ కోసం ఎంతగానో ప్రయత్నించిన ఇంగ్లాండ్ జట్టు, స్టువర్ట్ బ్రాడ్ ఓవర్‌లో రివ్యూకి వెళ్లింది. రిప్లైలో రాహుల్ బ్యాటుకి బాల్ తగలడం లేదని కనిపించడంతో ఇంగ్లాండ్ మూడు రివ్యూలను కోల్పోయింది...
58
రవీంద్ర జడేజా, కెఎల్ రాహుల్ కలిసి ఆరో వికెట్‌కి 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 53 బంతుల్లో 4 ఫోర్లతో 27 పరుగులు చేసిన జడేజా... టెస్టుల్లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు...
68
అత్యంత వేగంగా 2000 పరుగులు, 200+ వికెట్లు పడగొట్టిన భారత ఆల్‌రౌండర్‌గా కపిల్‌దేవ్, రవిచంద్రన్ అశ్విన్ తర్వాతి స్థానంలో నిలిచిన జడ్డూ, ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన ఐదో ప్లేయర్‌గా నిలిచాడు....
78
ఇయాన్ బోథమ్ 42 టెస్టుల్లో, కపిల్‌దేవ్ 50, ఇమ్రాన్ ఖాన్ 50, రవిచంద్రన్ అశ్విన్ 51 టెస్టుల్లో ఈ ఫీట్ అందుకోగా, జడేజాకి ఇది 53వ టెస్టు...
88
లంచ్ బ్రేక్ సమయానికి 66 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసిన టీమిండియా, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరును అధిగమించి 8 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది...