ఆ ఇద్దరినీ అవుట్ చేస్తే చాలు! టీమిండియాని ఓడించడం చాలా తేలిక... పాక్ మాజీ కెప్టెన్ కామెంట్స్..

Published : Aug 30, 2023, 09:16 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు ఇండియా - పాకిస్తాన్ మధ్య రెండు లేదా మూడు మ్యాచులు జరగబోతున్నాయి. సెప్టెంబర్ 2న ఆసియా కప్‌లో ఇరు జట్లు తలబడబోతున్నాయి. ఈ మ్యాచ్‌కి ముందు పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్, టీమిండియా బ్యాటింగ్ యూనిట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు..  

PREV
17
ఆ ఇద్దరినీ అవుట్ చేస్తే చాలు! టీమిండియాని ఓడించడం చాలా తేలిక... పాక్ మాజీ కెప్టెన్ కామెంట్స్..

‘టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌ని గమినిస్తే, వాల్లకు ఫిట్‌నెస్ సమస్యలు ఉన్నాయి. మహ్మద్ షమీ చాలా రోజులుగా క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. మహ్మద్ సిరాజ్ కూడా గాయపడి వస్తున్నాడు. జస్ప్రిత్ బుమ్రా ఏడాదిగా క్రికెట్ ఆడలేదు..

27

అలాగే బ్యాటింగ్ యూనిట్ అంతంతే. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తప్ప మిగిలిన యంగ్‌స్టర్స్‌ ఎప్పుడో కానీ ఆడడం లేదు. వాళ్లకు పెద్దగా అంతర్జాతీయ అనుభవం కూడా లేదు..
 

37

ఈ మధ్యకాలంలో టీమిండియా గెలిచిన మ్యాచులను గమనిస్తే రోహిత్ శర్మ బాగా ఆడిన మ్యాచుల్లో లేదా విరాట్ కోహ్లీ అద్బుతంగా ఆడిన మ్యాచుల్లో మాత్రమే గెలిచారు. ఈ ఇద్దరిపై కాకుండా మిగిలిన వారిపై ఆధారపడిన మ్యాచుల్లో చాలా కష్టపడ్డారు..

47

పాకిస్తాన్ పరిస్థితి అలా లేదు. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్, ఫకార్ జమాన్, షాదబ్ ఖాన్, షాహీన్ ఆఫ్రిదీ, హారీస్ రౌఫ్... ఇలా అందరికీ చాలా అంతర్జాతీయ అనుభవం ఉంది. పాక్ కోర్ టీమ్ చాలా పటిష్టంగా ఉంది..

57

టీమిండియాలో మ్యాచ్ విన్నర్లు లేరని కాదు. వాళ్ల టీమ్‌లో జడేజా, షమీ, బుమ్రా, రోహిత్, కోహ్లీ ఉన్నారు. అయితే బ్యాటింగ్‌ విషయంలో ఎక్కువగా రోహిత్, కోహ్లీపైనే ఆధారపడుతున్నారు. కచ్ఛితంగా చెప్పాలంటే విరాట్, రోహిత్‌లను త్వరగా అవుట్ చేస్తే, టీమిండియాని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు..

67
Kohli-Rohit

అదీకాకుండా టీమిండియాపై భారీ అంచనాలు ఉన్నాయి. వాళ్లపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. చాలా ఏళ్లుగా టీమిండియా, పాక్‌తో వన్డే మ్యాచులు ఆడలేదు. ఐపీఎల్ ఆడిన అనుభవం వారికి వన్డేల్లో ఉపయోగపడదు. హై టెన్షన్ మ్యాచుల్లో బాగా ఆడాలంటే ఐపీఎల్ ఆడిన అనుభవం సరిపోదు..

77
Image credit: Getty

పొద్దున లేచి, మధ్యాహ్నం తిని, రాత్రి ఐపీఎల్ ఆడుదాం అన్నట్టుగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉండదు. పాక్‌పై గెలవాలంటే తీవ్రమైన ఒత్తిడిని ఫేస్ చేయాలి. అదే అనుభవంతో మాత్రమే వస్తుంది..’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్..

Read more Photos on
click me!

Recommended Stories