Virat Kohli: కెప్టెన్సీ పోయింది.. బ్రాండ్ వాల్యూ కూడా గోవిందా.. మార్కెట్లో తగ్గుతున్న విరాట్ విలువ..

Published : Mar 29, 2022, 06:03 PM IST

Virat Kohli Brand Value: టీమిండియా మాజీ  సారథి విరాట్ కోహ్లికి భారీ షాక్ తగిలింది. ఇన్నాళ్లు జాతీయ క్రికెట్ జట్టుతో పాటు  ఐపీఎల్ లో ఆర్సీబీకి కూడా కెప్టెన్ గా  వ్యవహరించిన అతడు ఇటీవలే ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి బ్రాండ్ వాల్యూ కూడా.. 

PREV
18
Virat Kohli: కెప్టెన్సీ పోయింది.. బ్రాండ్ వాల్యూ కూడా గోవిందా.. మార్కెట్లో తగ్గుతున్న విరాట్ విలువ..

ఫార్మాట్, ఫామ్ తో సంబంధం లేకుండా కార్పొరేట్ వరల్డ్ లో చక్రం  తిప్పిన విరాట్ కోహ్లికి గడ్డుకాలం వచ్చింది. టీమిండియా కెప్టెన్ అన్న ట్యాగ్  పోయాక అతడి  బ్రాండ్ వాల్యూ కూడా  బాగా తగ్గుతున్నది. 

28

సెలబ్రిటీల  కార్పోరేట్ వ్యవహారాలు, వారి వ్యాపారాలకు సంబంధించిన విషయాలపై  నివేదికలు అందించే డఫ్ అండ్ ఫెల్ప్స్  తాజా  రిపోర్టు ప్రకారం... టీమిండియా కెప్టెన్సీ కోల్పోయాక కోహ్లి బ్రాండ్ వాల్యూ దారుణంగా పడిపోయిందని తెలిపింది. 

38

2020 లో  భారత జట్టుకు అన్ని ఫార్మాట్లకు సారథిగా వ్యవహరించినప్పుడు మార్కెట్ లో కోహ్లి బ్రాండ్ వాల్యూ 237.7 మిలియన్ డాలర్లు గా ఉండేది. అయితే  2021 టీ20  ప్రపంచకప్ తర్వాత కోహ్లి ఆ ఫార్మాట్  సారథ్య బాధ్యతల నుంచి తనంత  తానుగా తప్పుకున్నాడు.   అప్పుడే కోహ్లి పతనం వడివడిగా సాగింది. 

48

తర్వాత జరిగిన పరిణామాలు భారత క్రికెట్ ను కలవరానికి గురి చేశాయి. కోహ్లి-గంగూలీల మధ్య తలెత్తిన వివాదం తో కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది బీసీసీఐ. ఇక కొద్దిరోజులకే కోహ్లి.. దక్షిణాఫ్రికా పై భారత జట్టు దారుణ ఓటమి (1-2) నేపథ్యంలో టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా వైదొలిగాడు.  

58

కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా అతడికున్న క్రేజ్ దృష్ట్యా   విరాట్  మార్కెట్ లో  ఇంకొన్నాళ్లు కింగ్ లా ఉంటాడని  మార్కెట్ అనలిస్టులు అంచనా వేశారు. అయితే వాళ్ల అంచనా తప్పింది.  కెప్టెన్సీ కోల్పోవడంతో పాటు కోహ్లి ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా మారుతున్నది. 

68

అంతర్జాతీయ  మ్యాచులలో సెంచరీ చేయక కోహ్లి సుమారు రెండున్నరేండ్లు దాటింది.  సెంచరీ పక్కనబెడితే చెప్పుకోదగ్గ ప్రదర్శనలు కూడా ఇటీవల కాలంలో చేసింది లేదు. దీంతో  అతడి మార్కెట్ వాల్యూ కూడా క్రమంగా పడిపోతున్నది. తాజా అంచనాల ప్రకారం కోహ్లి బ్రాండ్ వాల్యూ  185.7 మిలియన్ డాలర్లకు పడిపోయింది. అంటే  50 మిలియన్ డాలర్ల మేరకు కోహ్లి నష్టపోయినట్టే.

78

ఇక కోహ్లి బ్యాట్ నుంచి ఇదే ప్రదర్శన కొనసాగితే గనక  మార్కెట్ లో అతడి విలువ మరింత  దిగజారే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే గతంలో ఎంఎస్ ధోని కెప్టెన్ గా తప్పుకుని ఆట నుంచి రిటైర్మెంట్ ప్రకటించాక కూడా అతడి బ్రాండ్ వాల్యూ  నెమ్మదిగా తగ్గింది. 

88

ఏదేమైనప్పటికీ కోహ్లి చేతిలో ఇప్పటికీ  సుమారు  బ్రాండ్లు ఉన్నాయి. మల్టీ నేషనల్ సంస్థలైన ఆ కంపెనీలు..  ఇంకా కోహ్లినే తమ ప్రచారకర్తగా కంటిన్యూ చేస్తున్నాయి.  అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా ధోని చేతిలో కూడా 25 బ్రాండ్లున్నాయి. 
 

Read more Photos on
click me!

Recommended Stories