టీమిండియాకి మోస్ట్ సక్సెస్‌ఫుల్ హెడ్ కోచ్‌లలో రవిశాస్త్రి ఒకరు. ఐసీసీ టైటిల్స్ గెలవలేకపోయినప్పటికీ ఐదేళ్ల కాలంలో టీమిండియాని అత్యంత పటిస్టమైన టీమ్స్‌లో ఒకటిగా నిలిపాడు రవిశాస్త్రి... ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ప్రవేశించిన భారత జట్టు, టైటిల్ మాత్రం గెలవలేకపోయింది...
గత ఏడాది ఐపీఎల్ 2021 సీజన్ కరోనా కారణంగా ప్రారంభమైన 29 రోజులకే బ్రేక్ పడిన విషయం తెలిసిందే. వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్, వృద్ధిమాన్ సాహా, సీఎస్‌కే బృందంలో కరోనా కేసులు వెలుగు చూడడంతో అనుకున్న షెడ్యూల్ కంటే ముందుగానే ఇంగ్లాండ్ గడ్డ మీద అడుగుపెట్టింది భారత జట్టు...
28
ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు వెళ్లిన టీమిండియా, మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్టు ఆరంభానికి ముందు అర్ధాంతరంగా ఆ మ్యాచ్ నుంచి తప్పుకుని... ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ కోసం యూఏఈ చేరుకుంది...
38
అప్పటికే సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న భారత జట్టు, మాంచెస్టర్ టెస్టు జరిగి ఉంటే అక్కడే సిరీస్‌ని ముగించేసేది. అయితే భారత బృందంలో కరోనా కేసులు వెలుగుచూడడంతో అది సాధ్యం కాలేదు. తాజాగా ఈ సంఘటనపై క్లారిటీ ఇచ్చాడు అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రి..
48
‘నాకు గత ఏడాది కరోనా వచ్చిన సమయంలో జట్టుకి అందుబాటులో ఉండలేకపోయాను. కరోనా నెగిటివ్‌గా తేలిన తర్వాత కూడా బయో బబుల్ నిబంధనల కారణంగా టీమ్‌కి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఒకవేళ నేను 6 రోజుల తర్వాత భారత డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి ఉంటే... అప్పుడు ఆ మ్యాచ్ జరిగి ఉండేది..
58
ఐదో టెస్టు మ్యాచ్ జరిగి, సిరీస్‌ని 3-1 తేడాతో సొంతం చేసుకునేవాళ్లం కూడా. ఎందుకంటే అప్పుడు రిథమ్ మా వైపే ఉంది. కానీ కోవిద్ వల్ల అలా జరగలేదు. ఇప్పుడు కోవిద్ గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు. ఇప్పుడు అది ఓ సాధారణ ఫ్లూ మాత్రమే...
68
ఓ రెండు పారాసెటమల్ ట్యాబ్లెట్లు వేసుకుంటే చాలు. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే సమయానికి భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ టీమ్‌కి అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ద్రావిడ్ లాంటి హెడ్ కోచ్ అండగా ఉంటే ఏ జట్టునైనా ఓడించగల కొండంత బలం, ప్లేయర్లలో నిండుతుంది..’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...
78
వాస్తవానికి 2021 ఇంగ్లాండ్ టూర్ మధ్యలో రద్దు కావడానికి కారణం కూడా రవిశాస్త్రియే. నిబంధనలకు విరుద్ధంగా ఇంగ్లాండ్‌లో జరిగిన తన పుస్తకావిష్కరణ సభకు విరాట్ కోహ్లీతో పాటు భారత బృందాన్ని మొత్తాన్ని తీసుకెళ్లాడు రవిశాస్త్రి...
88
ఈ ప్రోగ్రామ్ ముగిసిన నాలుగు రోజులకే రవిశాస్త్రి కరోనా పాజిటివ్‌గా తేలగా ఆ తర్వాత అప్పటి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌తో పాటు ఫిజియోథెరపిస్ట్, అసిస్టెంట్ ఫిజియో... ఇలా భారత బృందంలో వరుస కేసులు వెలుగుచూశాయి...