వాడింకా పిల్లోడే! విరాట్‌తో పోలికేంటి... బాబర్ ఆజమ్‌పై పాక్ మాజీ బౌలర్ వసీం అక్రమ్...

Published : Aug 24, 2022, 12:52 PM IST

కొన్నాళ్లుగా బాబర్ ఆజమ్ బీభత్సమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఏ దేశాలపై ఆడుతున్నాడు, ఏ దేశాల్లో సెంచరీలు చేస్తున్నాడనే విషయాన్ని పక్కనబెడితే సెంచరీల మోత మోగిస్తే.. పరుగుల ప్రవాహం పారిస్తున్నాడు బాబర్ ఆజమ్... అదే సమయంలో విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోవడంతో ఈ ఇద్దరినీ పోలుస్తూ కామెంట్లు, పోస్టులు పెడుతున్నారు పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్...

PREV
18
వాడింకా పిల్లోడే! విరాట్‌తో పోలికేంటి... బాబర్ ఆజమ్‌పై పాక్ మాజీ బౌలర్ వసీం అక్రమ్...
Virat Kohli-Babar Azam

70 అంతర్జాతీయ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, మూడేళ్లుగా సెంచరీ చేయలేకపోయాడు. ఇది కూడా బాబర్ ఆజమ్ ఫ్యాన్స్‌కి ఎనర్జీ నింపినట్టైంది. విరాట్ కోహ్లీ కంటే బాబర్ ఆజమ్‌ టాప్ క్లాస్ బ్యాటర్ అంటూ, వరల్డ్ క్లాస్ ప్లేయర్ అంటూ తెగ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

28

అయితే బాబర్ ఆజమ్‌ని విరాట్ కోహ్లీతో పోల్చడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్, లెజెండరీ ఆల్‌రౌండర్ వసీం అక్రమ్. విరాట్ కోహ్లీతో పోల్చడానికి కావాల్సిన స్థాయికి బాబర్ ఆజమ్ ఇంకా చేరుకోలేదంటూ అతని ఫ్యాన్స్ గాలి తీసేశాడు...

38
Babar Azam- Virat Kohli

‘క్రికెట్‌లో ఓ క్రికెటర్‌ని, మరో క్రికెటర్‌తో పోల్చి చూడడం అత్యంత సహజం. ఇంతకుముందు ఇంజమామ్ వుల్ హక్‌ని, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్‌లతో పోల్చి చూసేవాళ్లు క్రికెట్ ఫ్యాన్స్. అంతకుముందు సునీల్ గవాస్కర్, జావెల్ మియందాద్, గుండప్ప విశ్వనాథ్, జహీర్ అబ్బాస్ మధ్య కూడా ఇలాంటి పోలికలు వచ్చాయి...

48

ఇలా పోల్చి చూడడం చాలా కామన్. బాబర్ ఆజమ్ కొన్నాళ్లుగా మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తూ వస్తున్నాడు. అతనిప్పుడు కెరీర్ పీక్ ఫామ్‌లో ఉన్నాడు. తన టెక్నిక్‌లో కూడా ఎలాంటి లోపాలు లేవు...

58
Babar Azam


అందుకే బాబర్ ఆజమ్ నిలకడగా రాణిస్తూ ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పుడే అతన్ని విరాట్ కోహ్లీతో పోల్చడం కరెక్ట్ కాదు. ఎందుకంటే విరాట్ కోహ్లీకి ఉన్న అంతర్జాయతీయ అనుభవం ముందు బాబర్ ఆజమ్ ఇంకా చిన్నపిల్లాడే...

68
Image Credit: Getty Images

విరాట్ కోహ్లీతో పోల్చి చూడడానికి కావాల్సిన అర్హత సాధించాలంటే బాబర్ ఆజమ్‌కి ఇంకా చాలా సమయం పడుతుంది. విరాట్ ఇంకా ఫిట్‌గా ఉన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా టీమ్‌ని నడిపించాడు. కుర్రాడికి కెప్టెన్సీ ఇస్తే... తాను నేర్చుకుంటూ, జట్టుని నడిపిస్తాడు...

78
Babar Azam

విరాట్ కోహ్లీకి మాత్రమే కాదు, ప్రతీ టీమ్‌కి ఆసియా కప్ 2022 టోర్నీ చాలా కీలకం. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ 2022 ఆరంభానికి ముందు జరుగుతున్న టోర్నీలో విజయం సాధిస్తే రెట్టింపు ఉత్సాహంతో ప్రపంచకప్‌లో బరిలో దిగొచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు వసీం అక్రమ్...

88
Virat Kohli and Babar azam

వసీం అక్రమ్ చెప్పినట్టే విరాట్ కోహ్లీ 2008లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసి 14 ఏళ్ల కెరీర్‌ని పూర్తి చేసుకుంటే... బాబర్ ఆజమ్ ఏడేళ్ల క్రితం 2015లోనే పాక్ టీమ్‌లోకి వచ్చాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 10 వేల పరుగులు చేసిన బాబర్ ఆజమ్, 208 అంతర్జాతీయ మ్యాచులు  ఆడాడు...

Read more Photos on
click me!

Recommended Stories