మూడు గంటల్లో ముగుస్తుంటే, ఏడున్నర గంటలు ఎవరు భరిస్తారు... వన్డేలపై అజయ్ జడేజా కామెంట్...

Published : Jul 27, 2022, 04:16 PM IST

వన్డేలు వచ్చిన తర్వాత టెస్టులు చూసే వారి సంఖ్య తగ్గినట్టే, టీ20లు వచ్చిన తర్వాత వన్డే ఫార్మాట్‌ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. టెస్టు ఛాంపియన్‌షిప్ కారణంగా సుదీర్ఘ ఫార్మాట్ ఇంట్రెస్టింగ్‌గా మారితే, వన్డేల కాలం చెల్లిందంటూ మాజీ క్రికెటర్లు కామెంట్లు చేస్తున్నారు...

PREV
17
మూడు గంటల్లో ముగుస్తుంటే, ఏడున్నర గంటలు ఎవరు భరిస్తారు... వన్డేలపై అజయ్ జడేజా కామెంట్...

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా పూర్తిగా 50 ఓవర్ల పాటు సాగకపోవడం, ఆ తర్వాత బెన్ స్టోక్స్ అర్ధాంతరంగా వన్డేల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో ఈ ఫార్మాట్ మనుగడ గురించి చర్చ మొదలైంది...

27

టీ20 యుగంలో వన్డేలు చూడబుద్ది కూడా కావడం లేదని రవిచంద్రన్ అశ్విన్, ఉస్మాన్ ఖవాజా వంటి క్రికెటర్లు కామెంట్ చేయడం... అసలు వన్డేలకు 50 ఓవర్లుగా పెట్టడం ఎందుకు, 40 ఓవర్లు చేసేయండంటూ పాక్ మాజీ క్రికెటర్ షాహిదీ ఆఫ్రిదీ, భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కామెంట్ చేయడంతో ఈ చర్చ తారాస్థాయికి చేరింది...

37

తాజాగా భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కూడా వన్డేలకు కాలం చెల్లిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘వన్డేలు వచ్చిన తర్వాత టెస్టు మ్యాచుల సంఖ్య బాగా తగ్గిపోయింది. వన్డేల కారణంగా ప్లేయర్లకు, బ్రాడ్‌ కాస్టర్లకు, అసోసియేషన్‌కి బాగా డబ్బులు వచ్చేవి...

47

క్రికెట్ మనుగడకు బ్రాడ్ కాస్టర్లు చాలా అవసరం. ఎందుకంటే మీడియాలో ఏది ఎక్కువగా ప్రసారమైతే వాటికి ఎక్కువ పాపులారిటీ దక్కుతుంది. ఇంకోలా చెప్పాలంటే జనాలకు ఏం కావాలో మీడియా దాన్ని చూపించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది...

57

ఒకప్పుడు వన్డేలకు చాలా డిమాండ్ ఉండేది. కానీ టీ20లు వచ్చిన తర్వాత వన్డేలకు క్రేజ్ తగ్గింది. టీ20 రైట్స్‌కి డిమాండ్ బాగా పెరిగింది. అందుకే వన్డేల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. అయితే టెస్టులు మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటాయి..

67

ఎందుకంటే టెస్టు ఫార్మాట్‌కి ఉండే విలువ అలాంటిది. 20-30 ఏళ్ల కింద టీమిండియా ఆడిన టెస్టుల కంటే, ఇప్పుడు భారత జట్టు ఆడుతున్న టెస్టుల సంఖ్య ఎక్కువ...

77

మరి వన్డేల సంగతేంటి? మూడు గంటల్లో మ్యాటర్ ముగుస్తున్నప్పుడు ఏడున్నర గంటల పాటు టీవీల ముందు కూర్చొని చూసే ఓపిక ఎవరికి ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా...

click me!

Recommended Stories