ఎందరున్నా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా ట్రంప్ కార్డు అతనే... - సునీల్ గవాస్కర్...

Published : Jun 21, 2022, 07:06 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ అనుభవాలతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడే జట్టులో ఎవరెవరు ఉంటారనే విషయాన్ని వెంటనే చెప్పలేకపోతున్నారు క్రికెట్ విశ్లేషకులు. గత టోర్నీలో ఎదురైన పరాభవాల కారణంగా టీమిండియా ప్రయోగాలు చేసేందుకు సాహసం చేస్తుందా? లేక సీనియర్లను నమ్ముకుని బరిలో దిగుతుందా? అనేది చెప్పడం కష్టం...

PREV
17
ఎందరున్నా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా ట్రంప్ కార్డు అతనే... - సునీల్ గవాస్కర్...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఫెయిల్ అయినప్పటికీ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కి వరుస అవకాశాలు ఇస్తోంది భారత జట్టు. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆరు వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలిచిన భువీ, టీ20 వరల్డ్ కప్ ఆడే జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది...

27

భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, టీ20 వరల్డ్ కప్ ఆడడం ఖాయం. మరి మూడో ఫాస్ట్ బౌలర్‌గా ఎవరుంటారు? గత టోర్నీలో ఆడిన సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి అవకాశం ఇస్తారా? లేక ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన హర్షల్ పటేల్‌ని ఆడిస్తారా?...

37
Image credit: PTI

గత ఏడాది టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసిన హర్షల్ పటేల్,  13 టీ20 మ్యాచుల్లో 8.13 ఎకానమీతో 18.61 సగటుతో 18 వికెట్లు తీశాడు. భువీ 14, యజ్వేంద్ర చాహాల్ 11 వికెట్లతో హర్షల్ పటేల్ తర్వాతి స్థానాల్లో నిలిచారు...

47
Harshal Patel

‘టీమ్‌లో జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, షమీ ఎవరున్నా... హర్షల్ పటేల్ ట్రంప్ కార్డులా మారతాడు. పరిస్థితిని బట్టి బౌలింగ్‌లో మార్పులు చేసుకునే హర్షల్ పటేల్ లాంటి బౌలర్ అందుబాటులో ఉండడం ఏ కెప్టెన్‌కైనా వరమే..

57

పవర్ ప్లేలో బౌలింగ్ వేయగలడు, డెత్ ఓవర్లలో వికెట్లు తీయగలడు... పరుగుల ప్రవాహన్ని కట్టడి చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచగలడు.. అందుకే హర్షల్ పటేల్, టీమిండియాకి విలువైన ఆటగాడు.. ’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

67
Harshal Patel

‘హర్షల్ పటేల్ అద్భుతమైన బౌలర్. డెత్ ఓవర్లలో స్లో బాల్స్‌తో పరుగులు నియంత్రించే స్కిల్స్ అందరి దగ్గర ఉండదు. అందుకే అతను చాలా స్పెషల్ అయ్యాడు. లైన్ అండ్ లెగ్త్‌లో వేస్తూ వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలో పెట్టగల హర్షల్ పటేల్, టీ20 వరల్డ్ కప్ ఆడాల్సిందే...’ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్.. 

77
Harshal Patel

ఐపీఎల్ 2021 సీజన్‌లో 8.14 ఎకానమీతో 32 వికెట్లు తీసిన పర్పుల్ క్యాప్ గెలిచిన హర్షల్ పటేల్, ఈ సీజన్‌లో మరింత మెరుగైన ఎకానమీతో (7.66) 19 వికెట్లు తీశాడు.

click me!

Recommended Stories