సగం ధరకే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ టిక్కెట్లు... టీమిండియా ఓటమితో చూసేవారు లేక..

First Published Nov 12, 2022, 2:40 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ జరిగేది ఆస్ట్రేలియాలో అయినా, అక్కడ డామినేషన్ మొత్తం మనోళ్లదే. మెల్‌బోర్న్ స్టేడియంలో జరిగిన ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌లోకి 92 వేల మంది ప్రేక్షకులు హాజరైతే, అక్కడే జరిగిన ఇండియా - జింబాబ్వే మ్యాచ్‌కి కూడా 86 వేలకు ప్రేక్షకులు వచ్చారు.. అదే ఆతిథ్య ఆస్ట్రేలియా తప్పక గెలవాల్సిన ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌కి 18 వేల మంది మాత్రమే స్టేడియానికి వచ్చారు....

Pakistan-England

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ కూడా ప్రేక్షకులతో హౌస్ ఫుల్ అయిపోయిన స్టేడియంలోనే జరిగింది. అయితే ఇంగ్లాండ్, పాకిస్తాన్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కి మాత్రం ప్రేక్షకులు లేరట...

Image credit: Getty

వాస్తవానికి ఇండియా సెమీ ఫైనల్ చేరడం, న్యూజిలాండ్‌ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉండడంతో ఫైనల్‌లో టీమిండియా ఉంటుందని గట్టిగా ఫిక్స్ అయిపోయారు చాలామంది అభిమానులు. అందుకే ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌కి టికెట్లు కొనుక్కుని పెట్టుకున్నారు...

అయితే భారత జట్టు సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఓడి ఇప్పటికే ఇంటికి వచ్చేసింది. దీంతో ఫైనల్ మ్యాచ్ చూద్దామని భారీ ధర పెట్టి టిక్కెట్లు కొన్నవాళ్లు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు...
 

pak fans

మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్ - పాకిస్తాన్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ చూడడానికి భారత ఫ్యాన్స్ సిద్ధంగా లేరు. ఎందుకంటే భారతీయులకు పాక్ అంటే పడదు, అలాగే ఇంగ్లాండ్ అంటే కూడా పడదు. దీంతో ఫైనల్ మ్యాచ్‌కి టిక్కెట్లు కొన్నవాళ్లు, ఆన్‌లైన్‌లో సగం ధరకే వాటిని తిరిగి విక్రయిస్తున్నారట...

ఆస్ట్రేలియాతో భారతీయుల సంఖ్యతో పాటే పాకిస్తానీ ప్రజల సంఖ్య కూడా ఎక్కువే. అయితే వారంతా వచ్చిన స్టేడియంలో సగం సీట్లు కూడా నిండవు. ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న ఇంగ్లాండ్ వాసుల సంఖ్య చాలా తక్కువ. ఇంగ్లాండ్‌ ఫ్యాన్స్‌ ఎంతమంది, లండన్ నుంచి మెల్‌బోర్న్ వెళ్లి మ్యాచ్ చూస్తారనేది చెప్పలేని పరిస్థితి... 

మొత్తానికి ఇంగ్లాండ్, పాకిస్తాన్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కి మెల్‌బోర్న్ స్టేడియం సగం నిండినా గొప్పే అనుకుంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. అది కూడా టీమిండియా మ్యాచ్ చూద్దామని టికెట్ కొన్న భారతీయులు స్టేడియానికి వస్తేనే జరుగుతుందని అంటున్నారు. 

Image credit: PTI

ఫైనల్ మ్యాచ్‌కి టీఆర్‌పీ రావడం కూడా కష్టమే. సెమీ ఫైనల్ ఓటమిని ఇంకా మరిచిపోయి క్రికెట్ ఫ్యాన్స్... ఫైనల్ ఎవరు గెలిచినా పట్టించుకునే పరిస్థితిలో లేరు. చూస్తుంటే పాకిస్తాన్- జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్‌లా చివర్లో ఉత్కంఠరేగితే తప్ప... ఫైనల్‌కి క్రేజ్ వచ్చే అవకాశమే కనిపించడం లేదు..

click me!