సౌతాఫ్రికా ఆ ఒక్క మ్యాచ్ గెలిచి ఉంటేనా... ఇంత బాధ ఉండేది కాదేమో! లక్ ఈడ్చి పెట్టి తన్నడంతో...

First Published | Nov 13, 2022, 12:34 PM IST

మన బాగుపడకపోయినా పర్లేదు, పక్కనోడు బాగుపడకూడదు... ఇది సగటు భారతీయుడి ఫిలాసఫీ. పక్కనోడు కాస్త పాకిస్తానోడైతే... అస్సలు బాగుపడకూడదు. జెంటిల్మెన్ గేమ్ అని ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పుకున్నా, క్రికెట్‌లో... అందులోనూ ఐసీసీ టోర్నీల్లోనూ ఈ ఫార్ములా అప్లై అవుతుంది. ఇప్పుడు భారతీయులు ఫీలవుతుంది కూడా ఇదే...

Rohit-Rahul

జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా లేకుండా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడిన భారత జట్టు, ఆశించిన దాని కంటే బెటర్ పర్ఫామెన్స్‌తో సెమీ ఫైనల్ వరకూ చేరింది. అయితే మనోళ్లు సెమీస్ దాకా చేరడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఫైనల్‌ వెళ్లడం, టైటిల్ కొట్టడం పక్కా అనుకున్నారంతా...

Arshdeep Singh

అయితే సీన్ రివర్స్ అయ్యింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. టీమిండియా ఓటమిని తట్టుకోవడమే కష్టమనుకుంటే... లక్కీగా సెమీస్ చేరిన పాకిస్తాన్, న్యూజిలాండ్‌ని ఓడించి ఫైనల్‌కి ప్రవేశించింది...


టీమిండియాతో మ్యాచ్ ఓడిన తర్వాత పసికూన జింబాబ్వే చేతుల్లోనూ చిత్తుగా ఓడింది పాకిస్తాన్. ఇక పాక్ ప్రయాణం, గ్రూప్ స్టేజీలోనే ముగిసిందని వాళ్లు కూడా ఫిక్స్ అయిపోయారు. బంగ్లాతో మ్యాచ్‌కి ముందే స్వదేశానికి పయనం కావడానికి బ్యాగులు కూడా సర్దేసుకున్నారు...

అయితే సౌతాఫ్రికా చేసిన తప్పు, పాకిస్తాన్‌కి వరంగా మారింది. పసికూన నెదర్లాండ్స్ చేతుల్లో సౌతాఫ్రికా ఓడిపోవడంతో లక్కు ఈడ్చి పెట్టి తన్నడంతో వెళ్లి సెమీ ఫైనల్‌లో పడింది పాకిస్తాన్. అక్కడ న్యూజిలాండ్‌ చెత్తాటతో ఏకంగా ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నారు...

మరోవైపు భారత జట్టు సెమీ ఫైనల్‌లో ఓడడం, పాక్ ఫైనల్‌కి చేరడం టీమిండియా ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. పాకిస్తాన్, గ్రూప్ స్టేజీ నుంచి నిష్కమించి, టీమిండియా సెమీస్ నుంచే తప్పుకున్నా... ఇంత ఫీల్ అయ్యేవాళ్లు కాదేమో ! వాళ్లు ఫైనల్ చేరడం, భారత జట్టు చేరలేకపోవడంతో పాక్ మాజీలు, పాక్ క్రికెట్ ఫ్యాన్స్... టీమిండియా ఆటను తక్కువ చేసి, చులకనగా మాట్లాడుతున్నారు...

Image credit: Getty

ఇన్నాళ్లు టీమిండియాని చూసి కుళ్లుకుని, అసూయతో రగిలిపోయిన వాళ్లే.. ‘అయ్యో పాపం...’ అన్నట్టుగా జాలిగా, వెటకారంగా మాట్లాడుతున్నారు. ఇది భారత క్రికెట్ ఫ్యాన్స్‌ని మరింతగా ఆగ్రహానికి గురి చేస్తోంది. ఇండియా- ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ ముగిసి మూడు రోజులు గడిచినా టీమిండియాపై ట్రోల్స్‌ ఆగకపోవడానికి ఇది కూడా ఓ కారణం...

South Africa

నెదర్లాండ్స్‌తో జరిగిన ఒక్క మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిచి ఉంటే... ఈపాటికి సీన్ వేరేలా ఉండేదని సఫారీ జట్టును కూడా ట్రోల్ చేస్తున్నారు భారత అభిమానులు. ఎన్నడూ లేనట్టుగా సౌతాఫ్రికా జట్టు ఓడిపోతే, భారత క్రికెట్ ఫ్యాన్స్ రియాక్ట్ అవ్వడం చూసి సఫారీ టీమ్ షాక్ అవుతోందట...

పొరపాటున పాకిస్తాన్, టీ20 వరల్డ్ కప్ 2022 టైటిల్ గెలిస్తే... సౌతాఫ్రికాని ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తారు భారత అభిమానులు. తాము సెమీస్ చేరనందుకు సొంత దేశం వాళ్లు ఎంత ఫీలవుతున్నారో తెలీదు కానీ టీమిండియా ఫ్యాన్స్ ఇంతలా బాధపడుతుండడం మాత్రం సఫారీ టీమ్‌కి షాకింగ్‌గానే ఉందట... 

Latest Videos

click me!