హార్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్... వరల్డ్ కప్‌లో ఎన్ని మ్యాచులు ఆడినా ఒక్కసారి కూడా...

First Published | Nov 13, 2022, 12:07 PM IST

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా సెమీస్ నుంచే ఇంటిదారి పట్టింది. ఇంగ్లాండ్‌తో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది భారత జట్టు. సెమీస్ మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా పవర్ హిట్టింగ్‌తో హాఫ్ సెంచరీ చేసినా, ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో టీమిండియా అట్టర్ ఫ్లాప్ అయ్యింది...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటుతో 40 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, బౌలింగ్‌లో 3 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే 53 బంతుల్లో 6 ఫోర్లు,  4 సిక్సర్లతో 82 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు...

విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ కారణంగా హార్ధిక్ పాండ్యా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలవలేకపోయాడు. ఇంగ్లాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 63 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా... భారత జట్టు ఓటమితో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును మిస్ అయ్యాడు...


hardik

2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లోనూ ఇలాంటి ఒంటరిపోరాటం చేశాడు హార్ధిక్ పాండ్యా. ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యధిక మ్యాచులు ఆడి ఒక్కసారి కూడా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలవని మూడో భారత ప్లేయర్‌గా నిలిచాడు హార్ధిక్ పాండ్యా...

Dhoni-Gambhir

రాహుల్ ద్రావిడ్, వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో 41 మ్యాచులు ఆడి ఒక్కసారి కూడా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలవలేకపోయాడు. భారత జట్టుకి రెండు వరల్డ్ కప్స్ దక్కడంలో కీలక పాత్ర పోషించిన గౌతమ్ గంభీర్ కూడా తన కెరీర్‌లో ఐసీసీ టోర్నీల్లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలవకపోవడం విశేషం...

2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో 75 పరుగులు చేసిన గౌతమ్ గంభీర్, 3 వికెట్లు తీసిన ఇర్ఫాన్ పఠాన్ కారణంగా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలవలేకపోయాడు. అలాగే 2011 వన్డే వరల్డ్ కప్‌లో 97 పరుగులు చేసిన గంభీర్, 91 పరుగులు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ కారణంగా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ మిస్ అయ్యాడు...

హార్ధిక్ పాండ్యా ఇప్పటిదాకా 30 ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచులు ఆడినా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలవలేకపోయాడు. భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ 23 మ్యాచులు, అజిత్ అగార్కర్ 21 వరల్డ్ కప్ మ్యాచులు ఆడినా ఈ అవార్డులు గెలవలేకపోయారు...

Image credit: Getty

భారత వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఇప్పటిదాకా 2014 నుంచి 20 ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచులు ఆడాడు. అయితే ఒక్కదాంట్లో కూడా సరైన ఇన్నింగ్స్ ఆడలేకపోయిన కెఎల్ రాహుల్, ఒక్కసారి కూడా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలవలేకపోయాడు. భారత సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కూడా 20 ఐసీసీ మ్యాచులు కూడా ఒక్కదాంట్లోనూ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలవకపోవడం విశేషం...

Latest Videos

click me!