వచ్చే టీ20 వరల్డ్ కప్‌లో ఈ ముఖాలు కనిపించకూడదు... టీమిండియా సీనియర్లపై వీరేంద్ర సెహ్వాగ్...

First Published | Nov 12, 2022, 6:47 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హార్ధిక్ పాండ్యా తప్ప మిగిలిన భారత ప్లేయర్లు ఎవ్వరూ చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయారు. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో భారత ఓపెనర్లతో పాటు సూర్యకుమార్ యాదవ్ స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరడం, బౌలర్లు అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది...

Rohit Sharma

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో గ్రూప్ స్టేజీ నుంచే నిష్కమించిన భారత జట్టు, 2021 టీ20 వరల్డ్ కప్‌లోనూ ఫైనల్ చేరలేకపోయింది. అక్కడా ఇక్కడా దాదాపు ఒకే జట్టును కొనసాగించింది టీమిండియా. వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహార్, ఇషాన్ కిషన్ వంటి ఇద్దరు ముగ్గురు ప్లేయర్లు తప్ప కోర్ టీమ్ అయితే అదే...

టీ20 వరల్డ్ కప్ 2022 పరాజయంతో టీమిండియాలో సంచలన మార్పులు చేయాలని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. 2007 వన్డే వరల్డ్ కప్ పరాభవం తర్వాత 2007 టీ20 వరల్డ్ కప్‌లో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ వంటి సీనియర్లు లేకుండా టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు వీరేంద్ర సెహ్వాగ్...

Latest Videos


Kohli and Sehwag

‘నేను టీమ్ మైండ్‌సెట్ గురించి మాట్లాడదల్చుకోలేదు, అయితే జట్టులో మాత్రం మార్పులు చాలా అవసరం. వచ్చే వరల్డ్ కప్‌లో ఈ ముఖాలు కనిపించకూడదు. 2007 టీ20 వరల్డ్ కప్‌లోనూ ఇలాగే జరిగింది. ఎన్నో ఏళ్లుగా టీమ్‌లో ఉన్న సీనియర్లు, టీ20 వరల్డ్ కప్ ఆడలేదు...

కుర్రాళ్లు జట్టులో ఉంటే టీమ్‌పై పెద్దగా అంచనాలు ఉండవు. 2007 టీ20 వరల్డ్ కప్ గెలవడానికి కూడా ఇదే కారణం. వచ్చే టీ20 వరల్డ్ కప్‌కి కూడా ఇలాగే చేయాలి. కుర్రాళ్లను పంపిస్తే, వాళ్లు వరల్డ్ కప్ గెలుస్తారని ఎవ్వరూ అనుకోరు. అదే టీమిండియా ఫ్యూచర్ టీమ్‌గా మారుతుంది...

Virender Sehwag

రెండేళ్ల తర్వాత ఆడే టోర్నీకి టీమ్‌ని తయారుచేయాలంటే ఇప్పటి నుంచే మొదలెట్టాలి. సరిగ్గా ఆడని సీనియర్లు వచ్చే వరల్డ్ కప్‌లో ఉండకూడదని అనుకుంటున్నా. సెలక్టర్లు ఈ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటారని అనుకుంటున్నా...

నా అనుమానం ఏంటంటే కనీసం ఈ సెలక్టర్లైనా వచ్చే వరల్డ్ కప్ వరకూ ఉంటారా? ఈ పరాజయం తర్వాత సెలక్షన్ ప్యానెల్ మారిపోతుందని, కొత్త మేనేజ్‌మెంట్ వస్తుందని అనుకుంటున్నా. ఒక్కటి మాత్రం నిజం.. వచ్చే వరల్డ్ కప్‌లో ఇదే టీమ్, ఇలాగే ఆడితే అప్పుడు కూడా ఇదే రిజల్ట్ వస్తుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. 

click me!