మాకిది సరిపోదు సర్... పాకిస్తాన్‌పై అలాంటి రివెంజ్ కావాలంటున్న టీమిండియా ఫ్యాన్స్...

Published : Aug 30, 2022, 03:53 PM IST

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత్‌పై మొట్టమొదటి వరల్డ్ కప్ విజయాన్ని అందుకుంది పాకిస్తాన్. ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో భారత్‌ చేతుల్లో చిత్తుగా ఓడుతూ వచ్చిన పాకిస్తాన్‌కి ఈ విజయం రెట్టింపు ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది. లేక లేక వచ్చిన విజయంతో పాక్ ఫ్యాన్స్‌కి, మాజీ క్రికెటర్లకు కొమ్ములు మొలిచాయి... ఆసియా కప్‌లో భారత్ చేతుల్లో ఓడడంతో అవి కాస్త తగ్గాయి, అయితే పూర్తిగా ఊడిపోలేదు...

PREV
17
మాకిది సరిపోదు సర్... పాకిస్తాన్‌పై అలాంటి రివెంజ్ కావాలంటున్న టీమిండియా ఫ్యాన్స్...
Image credit: PTI

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఎదురైన పరాభవానికి ఆసియా కప్ 2022 టోర్నీలో ప్రతీకారం తీర్చుకుంది భారత జట్టు. పాక్ జట్టును 19.5 ఓవర్లలో 147 పరుగులకి ఆలౌట్ చేసిన టీమిండియా, ఆ లక్ష్యాన్ని ఆఖరి ఓవర్‌లో ఛేదించింది...

27
IND vs PAK

భారత జట్టు, పాక్‌పై గెలిచి ప్రతీకారం తీర్చుకున్నా టీమిండియా ఫ్యాన్స్‌కి మాత్రం ఈ విజయం పూర్తి సంతృప్తిని ఇవ్వలేదు. కారణం టీ20 వరల్డ్ కప్ 2021 స్కోరు కార్డే...

37

2021 టీ20 వరల్డ్ కప్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. తొలి బంతికి రోహిత్ శర్మ డకౌట్ కాగా కెఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ, రిషబ్ పంత్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది టీమిండియా..

47

అయితే ఈ లక్ష్యాన్ని పాక్ జట్టు వికెట్ కోల్పోకుండా ఛేదించింది. 17.5 ఓవర్లలో 152/0 స్కోరు చేసి మ్యాచ్‌ని ఏకపక్షంగా ముగించింది పాక్. ఈ విజయం తర్వాత పాక్ క్రికెట్ ఫ్యాన్స్ చాలా మంది 152-0 నెంబర్ వేసిన జెర్సీలతో క్రికెట్ మ్యాచ్‌లకు హాజరయ్యారు...

57

అంతకుముందు భారత జట్టు చేతుల్లో పాక్ చిత్తయ్యిన మ్యాచులన్నింటినీ ఆ మ్యాచ్‌ మరిపించివేసింది. ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్ కూడా అలాంటి రివెంజ్ కోరుకుంటున్నారు. పాక్‌ ఎంత స్కోరు చేసినా దాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించి... 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకోవాలని ఆశపడుతున్నారు...

67

లేదా పాక్ ఫ్యాన్స్ మళ్లీ 152-0 నెంబర్‌ని గుర్తు చేసుకోకుండా పాకిస్తాన్ టీమ్‌ని స్వల్ప స్కోరుకే ఆలౌట్ చేయాలని గట్టిగా మొక్కుతున్నారు. మొత్తానికి భారత్, పాక్ మధ్య జరిగిన ఆసియా కప్ 2022లో జరిగిన మొదటి మ్యాచ్.. క్రికెట్ ఫ్యాన్స్‌కి మజాని అందించినా భారత క్రికెట్ ఫ్యాన్స్‌లో కొందరికి మాత్రం కోరుకున్న కిక్‌ని ఇవ్వలేకపోయింది... 

77
Image credit: PTI

అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఆసియా కప్ 2022 టోర్నీలో పాక్, భారత్ మరోసారి తలబడడం దాదాపు ఖాయం. ఆ తర్వాత రెండు జట్లు స్థాయికి తగ్గట్టుగా ఆడితే మరోసారి ఆసియా కప్ 2022 టోర్నీ ఫైనల్‌ కూడా ఆడొచ్చు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలోనూ భారత్, పాక్ మ్యాచ్ ఉంది. కాబట్టి గత ఏడాది పరాభవానికి ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియాకి ఒకటికి మూడు ఛాన్సులు ఉన్నాయి...

click me!

Recommended Stories