గంభీర్‌ని అవమానించిన షాహిద్ ఆఫ్రిదీ... నవ్వి ఊరుకున్న హర్భజన్! భజ్జీపై ట్రోల్స్...

Published : Aug 30, 2022, 01:39 PM IST

టీమిండియాకి రెండు వరల్డ్ కప్స్ అందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అయితే, ఆ రెండు వరల్డ్ కప్స్ రావడంలో కీలక పాత్ర పోషించిన బ్యాటర్ గౌతమ్ గంభీర్. వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి టీమిండియాకి ఓపెనర్‌గా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా భారత జట్టుకి ఎన్నో విజయాలు అందించిన గంభీర్‌పై పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దాన్ని ఖండించాల్సిన భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ చిరునవ్వులు చిందించడం తీవ్ర వివాదాస్పదమైంది...

PREV
18
గంభీర్‌ని అవమానించిన షాహిద్ ఆఫ్రిదీ... నవ్వి ఊరుకున్న హర్భజన్! భజ్జీపై ట్రోల్స్...

గౌతమ్ గంభీర్‌కి కాస్త ఆవేశం ఎక్కువ. అదీ దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే గౌతీ మరింత ఆవేశపరుడిగా మారిపోయేవాడు. టీమిండియా ప్లేయర్లతో దురుసుగా ప్రవర్తించే పాక్ మాజీ క్రికెటర్లు షాహిద్ ఆఫ్రిదీ, షోయబ్ అక్తర్ అంటే గౌతమ్ గంభీర్‌కి అస్సలు పడదు...

28
Wasim Akram-Gambhir

తన ఇగోని కదిలించాడని భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతోనే ఆన్ ఫీల్డ్ గొడవకి దిగిన గౌతమ్ గంభీర్, చాలాసార్లు ఆస్ట్రేలియా, పాక్ క్రికెటర్లతో వాగ్వాదానికి దిగాడు. ఆన్ ఫీల్డ్ ఎంత కొట్టుకున్నా అవన్నీ మరిచిపోయి, ఆఫ్ ఫీల్డ్ నవ్వుతూ మాట్లాడడం గౌతమ్ గంభీర్‌కి చేత కాదు...

38
afridi

అందుకే గౌతమ్ గంభీర్, షాహిదీ ఆఫ్రిదీ మధ్య ఎన్నో ఏళ్లుగా విభేదాలు అలాగే ఉన్నాయి. ఇండియా, పాకిస్తాన్ మధ్య సంబంధాల గురించి షాహిద్ ఆఫ్రిదీ చేసిన ట్వీట్‌పై గౌతమ్ గంభీర్ తీవ్రంగా స్పందించాడు. ఈ విషయాలన్నింటినీ మనసులో పెట్టుకున్న ఆఫ్రిదీ, ఆసియా కప్ 2022 సమయంలో భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

48

‘నేను చాలామంది భారత క్రికెటర్లతో గొడవ పడ్డాను, అయితే అది ఆన్ ఫీల్డ్... అప్పటి వరకూ మాత్రమే ఉండేది. అయితే కొన్నిసార్లు గౌతమ్ గంభీర్‌తో సోషల్ మీడియాలో కూడా కొన్ని చిన్న చిన్న గొడవలు జరిగాయి. నాకు తెలిసి గౌతమ్ గంభీర్ అంటే భారత క్రికెట్‌లో కూడా ఎవ్వరికీ నచ్చదు అనుకుంటా...’ అంటూ కామెంట్ చేశాడు షాహిద్ ఆఫ్రిదీ...

58
harbhajan

షాహిద్ ఆఫ్రిదీ కామెంట్లను ఇటు వైపు నుంచి వింటున్న భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, ఆ వ్యాఖ్యలను ఖండించకపోగా... ఓ నవ్వు నవ్వి వదిలేశాడు. నవ్వు నవ్వడం ద్వారా గంభీర్ అంటే భారత క్రికెటర్లకు నచ్చేదని ఆఫ్రిదీ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా అంగీకరించాడు భజ్జీ...

68
harbhajan

భజ్జీ చర్యలపై సోషల్ మీడియా జనాలు తీవ్రంగా స్పందిస్తున్నారు. భారత జట్టుకి ఎన్నో విజయాలు అందించిన ప్లేయర్ గౌతమ్ గంభీర్‌ని, పాక్ మాజీ క్రికెటర్ ఇలా అవమానిస్తుంటే ఖండించాల్సిందిపోయి... ఇలా నవ్వుతావా? అంటూ భజ్జీని ట్రోల్ చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్...

78

గౌతమ్ గంభీర్‌కి మాహీతో, విరాట్ కోహ్లీతో గొడవలు ఉంటే ఉండొచ్చు. అయినంతమాత్రాన భారత జట్టుకి ఎన్నో అద్భుత విజయాలు అందించిన గౌతీని ఓ పొరుగుదేశం క్రికెటర్ ఇలా అవమానిస్తుంటే... నవ్వి ఊరుకోవడం క్షమించరాని తప్పుగా పరిగణించాలని అంటున్నారు భారత క్రికెట్ ఫ్యాన్స్...

88

ఓ ఎండకు ఆ గొడవ పట్టే హర్భజన్ సింగ్ లాంటి ద్వంద్వ వైఖరి ఉన్న మనుషుల కంటే సూటిగా ముఖం మీద కొట్టినట్టుగా నిజం మాట్లాడే గౌతమ్ గంభీర్ లాంటివాళ్లే భారత్‌‌కి కావాలని పోస్టులు చేస్తున్నారు.. భారతదేశాన్ని, భారత ప్రభుత్వాన్ని అవమానించే ఆఫ్రిదీని గౌతీ సోషల్ మీడియాలో నేరుగా తిట్టడం వల్లే అతను ఇలా మాట్లాడుతున్నాడనే విషయం కూడా భజ్జీకి తెలియలేదా... అంటూ హర్భజన్ సింగ్‌ని ట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్.. 

click me!

Recommended Stories