ఫిట్‌నెస్ లేకుంటే ఎన్ని సెంచరీలు చేసినా వేస్టేనా... సర్ఫరాజ్ ఖాన్‌కి ఈసారైనా చోటు దక్కుతుందా...

Published : Oct 02, 2022, 11:52 AM IST

టీమిండియా తరుపున ఆడాలంటే బీసీసీఐ నిర్వహించే ఫిట్‌నెస్ టెస్టు పాస్ కావాల్సిందే. దేశవాళీ టోర్నీల్లో, ఐపీఎల్‌లో మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నా పృథ్వీ షాను సెలక్టర్లు పట్టించుకోకపోవడానికి కారణం ఇదే. ఇప్పుడు దేశవాళీ టోర్నీల్లో రికార్డులు కొల్లగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్‌కి టీమిండియాలో చోటు దక్కుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది...

PREV
19
ఫిట్‌నెస్ లేకుంటే ఎన్ని సెంచరీలు చేసినా వేస్టేనా... సర్ఫరాజ్ ఖాన్‌కి ఈసారైనా చోటు దక్కుతుందా...
Sarfaraz Khan

రెడ్ బాల్ క్రికెట్‌లో సంచలన పర్ఫామెన్స్‌లతో దుమ్మురేపుతున్నాడు సర్ఫరాజ్ ఖాన్. రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో 134 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్, దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో 127 పరుగులు చేశాడు. ఇరానీ కప్‌ మ్యాచ్‌లో 138 పరుగులు చేసి అదరగొట్టాడు...

29
Sarfaraz Khan

29 మ్యాచుల్లో 43 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్‌లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ 2928 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 43 ఇన్నింగ్స్‌ల తర్వాత ది గ్రేట్ డాన్ బ్రాడ్‌మన్ కంటే సర్ఫరాజ్ ఖాన్ ఓ పరుగు ఎక్కువ చేయడం విశేషం.

39

డాన్ బ్రాడ్‌మన్ సగటు 83.63 కాగా, సర్పరాజ్ ఖాన్ ఆయన తర్వాతి ప్లేస్‌లో నిలిచాడు. 2022లో ఆరు సెంచరీలు బాదిన సర్ఫరాజ్ ఖాన్, రంజీ ట్రోఫీలో 982 పరుగులు చేశాడు. 2 డబుల్ సెంచరీలు, ఓ త్రిబుల్ సెంచరీ నమోదు చేశాడు...

49
Image credit: BCCI

అయితే ఇంత చేసినా సర్ఫరాజ్ ఖాన్‌కి టీమిండియా టెస్టు టీమ్‌లో చోటు దక్కుతుందా? అనేది అనుమానంగానే మారింది. కారణం అతని ఫిట్‌నెస్ లెవెల్స్. 24 ఏళ్ల భారీ ఖాయంతో 75 కిలోలకు పైగా బరువు ఉంటాడు. ఈ ఖాయంతో బీసీసీఐ నిర్వహించే ఫిట్‌నెస్ టెస్టులు పాస్ కావాలంటే అయ్యే పని కాదు...

59

ఐపీఎల్‌‌లో అదిరిపోయే పర్పామెన్స్ ఇచ్చిన రాహుల్ తెవాటియా కూడా ఫిట్‌నెస్ టెస్టులు క్లియర్ చేయలేక టీమిండియాకి దూరమయ్యాడు. అంతెందుకు ఫిట్‌గా ఉండే ఇషాన్ కిషన్ కూడా ఫిట్‌నెస్ టెస్టులు పాస్ కావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది...

69

ఇంజమామ్ వుల్ హక్, వీరేంద్ర సెహ్వాగ్, కిరన్ పోలార్డ్, డ్వేన్ లివిరాక్, రహకీం కార్న్‌వాల్ వంటి క్రికెటర్లు శరీర బరువుతో సంబంధం లేకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించారు. ఇప్పుడు భారత జట్టులో ఉన్న రోహిత్ శర్మ, రిషబ్ పంత్ కూడా మరీ ఫిట్ క్రికెటర్లేమీ కాదు...

79
sarfaraz khan


క్రికెటర్లు ఫిట్‌గా ఉండడం అవసరమా? లేక పరుగులు చేయడం అవసరమా? అనేది బోర్డు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. రవీంద్ర జడేజా, కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా వంటి ఫిట్ క్రికెటర్లు కూడా తరుచూ గాయపడుతూ జట్టుకి దూరమవుతున్నారు.

89

మరి సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్‌లో చూపిస్తున్న పర్ఫామెన్స్‌ని ప్రమాణీకంగా చేసుకుని అతనికి భారత జట్టులో చోటు కల్పిస్తారా? లేక ఎంత టాలెంట్ ఉన్నా ఫిట్‌నెస్ టెస్టు పాస్ కాకపోతే టీమిండియాకి ఆడనిచ్చేదిలే... అంటారా? అనేది ఇంకొన్ని రోజుల్లో తేలిపోనుంది...

99

ప్రస్తుతం సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టు, ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ ఆడుతుంది. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత మళ్లీ న్యూజిలాండ్, శ్రీలంకలతో టీ20 సిరీస్‌లు ఉంటాయి. డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడబోతోంది భారత జట్టు..

click me!

Recommended Stories