మిడిల్ ఆర్డర్‌లో ఇషాన్ కిషన్... ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్! కన్ఫార్మ్ చేసిన రోహిత్ శర్మ...

First Published Jan 17, 2023, 5:32 PM IST

వరల్డ్ రికార్డు డబుల్ సెంచరీ బాదిన తర్వాత ఒక్క వన్డే కూడా ఆడలేకపోయాడు ఇషాన్ కిషన్. ఒక్క మ్యాచ్‌లో ఆడి ఆ తర్వాత మూడు మ్యాచుల్లో ఫెయిల్ అయ్యే ఇషాన్ కిషన్ కంటే వన్డేల్లో నిలకడైన ప్రదర్శన ఇస్తున్న శుబ్‌మన్ గిల్‌కి వరుస అవకాశాలు ఇవ్వాలని ఫిక్స్ అయ్యింది టీమిండియా...

శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ ఇద్దరూ పెద్దగా మెప్పించలేకపోయారు. ఇషాన్ కిషన్ మొదటి టీ20లో కాస్త మెరుపులు మెరిపించినా శుబ్‌మన్ గిల్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు...

Image credit: PTI

వన్డే సిరీస్‌లో మాత్రం శుబ్‌మన్ గిల్ మంచి పర్ఫామెన్స్ చూపించాడు. 69 సగటుతో 207 పరుగులు చేసి విరాట్ కోహ్లీ (283) తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు...
 

Image credit: PTI

బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ బాది రికార్డు క్రియేట్ చేశాడు. ఫాస్టెస్ట్ వన్డే డబుల్ సెంచరీ, అతి పిన్న వయసులో డబుల్ సెంచరీ బాదిన బ్యాటర్‌గా వరల్డ్ రికార్డులు క్రియేట్ చేశాడు...

Image credit: PTI

అయితే శుబ్‌మన్ గిల్ కారణంగా లంకతో వన్డే సిరీస్ ఆడలేకపోయిన ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్  పెళ్లి చేసుకోవడానికి టీమ్ నుంచి తప్పుకోవడంతో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడబోతున్నాడు...

Image credit: PTI

బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో ఓపెనింగ్ చేసిన ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్ ప్లేస్‌లో ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి రాబోతున్నాడు. ఈ విషయాన్ని ఖరారు చేశాడు రోహిత్ శర్మ...

‘శుబ్‌మన్ గిల్ ఓపెనర్‌గా వన్డేల్లో నిలదొక్కుకున్నాడు. అతన్ని కదిపితే టీమ్ కాంబినేషన్ దెబ్బ తింటుంది. ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్ ప్లేస్‌లో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తాడు. తన రోల్ గురించి ఇప్పటికే ఇషాన్ కిషన్‌కి క్లారిటీ ఇచ్చాం...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..
 

Image credit: Getty

ఓపెనర్‌గా డబుల్ సెంచరీ బాదిన తర్వాతి మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి రాబోతున్న ఇషాన్ కిషన్, ఎలాంటి ఇన్నింగ్స్ ఆడతాడో చూడాలి. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియా, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరగనుంది. 

click me!