ఓపెనర్లు చాలామంది ఉన్నారు... రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీలా ఫినిషర్‌గా వస్తే బెటర్!...

First Published Dec 8, 2022, 1:17 PM IST

పేపరు మీద టీమిండియా చాలా పటిష్టమైన జట్టు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్... ఇలా టీమ్‌లో మ్యాచ్ విన్నర్లకు కొదవ లేదు. అయితే బంగ్లాదేశ్‌లో విజయాలు అందుకోవడానికి కూడా తెగ కష్టపడుతోంది భారత జట్టు...

Rohit Sharma

వర్షం కారణంగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ని కోల్పోయిన టీమిండియా, బంగ్లాదేశ్ పర్యటనలోనూ వన్డే సిరీస్‌ని దక్కించుకోలేకపోయింది. మొదటి వన్డేలో వికెట్ తేడాతో ఓటమి పాలైన భారత జట్టు, రెండో వన్డేలో ఆఖరి బంతి వరకూ పోరాడి విజయానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

Rohit Sharma

అయితే మ్యాచ్‌పై ఆశలు వదులుకున్న సమయంలో రోహిత్ శర్మ గాయంతో బాధపడుతూనే క్రీజులోకి వచ్చాడు. 28 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 51 పరుగులు చేసి అదరగొట్టాడు. ఆఖరి ఓవర్‌లో టీమిండియా విజయానికి 20 పరుగులు కావాల్సి రాగా 14 పరుగులు రాబట్టగలిగాడు రోహిత్...

Rohit Sharma

రోహిత్ అద్వితీయ పోరాటం కారణంగా దాదాపు మ్యాచ్ గెలిచినంత పని చేసింది భారత జట్టు. రోహిత్‌కి మరో రెండు బాల్స్ దొరికి ఉంటే మ్యాచ్ ఫలితం మారిపోయి ఉండేది. ఓపెనర్‌గా ఫెయిల్ అవుతూ వస్తున్న రోహిత్, గాయం కారణంగానైనా ఓ మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు.

ప్రస్తుతం టీమిండియాలో ఓపెనర్ ప్లేస్ కోసం చాలా పోటీ ఉంది. శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షాతో పాటు రిషబ్ పంత్ కూడా ఓపెనింగ్ చేయగలడు. కాబట్టి కెప్టెన్ రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీలా ఫినిషర్ రోల్‌కి సెటిల్ అయితే బెటర్ అంటున్నారు అభిమానులు...

కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ఓపెనర్‌గా రోహిత్ శర్మ నుంచి తన రేంజ్ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా రాలేదు. పూర్తి స్థాయి కెప్టెన్‌గా రోహిత్ శర్మ బ్యాటు నుంచి వచ్చిన బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే. కాబట్టి ఓపెనర్‌గా రావడం మానేసి, మాహీలా రోహిత్ ఫినిషర్‌గా మారితే బెటర్ అంటున్నారు నెటిజన్లు...

Image credit: Getty

ఫినిషర్‌గా లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వస్తే ఎక్కువ బంతులు ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. గాయపడే అవకాశాలు తగ్గుతాయి. రోహిత్ శర్మకు మరికొన్నాళ్లు కెరీర్‌ని కొనసాగించే అవకాశమూ దొరుకుతుందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...
 

click me!