టీ20 వరల్డ్ కప్‌లో అతను ఉండాల్సిందే... ఫామ్‌లో లేని భువీకి దీపక్ చాహార్ చెక్ పెడతాడా...

First Published Sep 29, 2022, 11:45 AM IST

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో దీపక్ చాహార్ అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. తొలి ఓవర్‌లోనే వికెట్ తీసిన దీపక్ చాహార్, 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి అదరగొట్టాడు. పిచ్ స్వింగ్‌కి అద్భుతంగా అనుకూలిస్తుండడంతో చాహార్ చెలరేగిపోయాడు... టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో టీమిండియా ఫ్యాన్స్‌ని మెప్పించాడు...

Bhuvi

ఆస్ట్రేలియాలో పిచ్‌లు బౌన్స్‌తో పాటు స్వింగ్‌కి బాగా అనుకూలిస్తున్నాయి. అందుకే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఫెయిల్ అయిన తర్వాత కూడా భువనేశ్వర్ కుమార్‌ని టీ20ల్లో కొనసాగిస్తూ వస్తోంది టీమిండియా. ఆస్ట్రేలియా పరిస్థితులను భువీ చక్కగా వాడుకుంటాడని సెలక్టర్ల నమ్మకం...

Bhuvi

అయితే భువీ మాత్రం వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. ఆసియా కప్ 2022 టోర్నీలో ఆ తర్వాత ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో కూడా భువనేశ్వర్ కుమార్ ఫెయిల్ అయ్యాడు. దీంతో భువీ, టీ20 వరల్డ్ కప్‌ 2022లో కూడా ఫ్లాప్ అయితే టీమిండియా పరిస్థితి ఏంటి? ‘స్వింగ్ కింగ్’ భువనేశ్వర్ కుమార్, టీమిండియాకి వరంగా మారతాడా? లేదా భారంగా మారతాడా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు...

Arshdeep Singh - Deepak Chahar

తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో దీపక్ చాహార్ పర్ఫామెన్స్‌తో భువీపై మరిన్ని విమర్శలు పెరిగాయి. ఆవేశ్ ఖాన్ ఫెయిల్ అవ్వడం, హర్షల్ పటేల్ కూడా అనుకున్నంతగా రాణించకపోవడంతో భువనేశ్వర్ కుమార్‌కి పెద్దగా పోటీ లేకుండా పోయింది...

అయితే దీపక్ చామార్ పర్ఫామెన్స్‌తో స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్న దీపక్ చాహార్‌ని భువనేశ్వర్ కుమార్ ప్లేస్‌లో టీ20 వరల్డ్ కప్ 2022 ఆడించాలనే డిమాండ్ వినిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీతో పాటు 2022 టీ20 వరల్డ్ కప్ టీమ్‌లోనూ కేవలం స్టాండ్ బై ప్లేయర్‌గానే చోటు దక్కించుకున్నాడు భారత ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ దీపక్ చాహార్.

Image credit: Getty

ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు గాయపడిన దీపక్ చాహార్, ఆరు నెలల పాటు టీమ్‌కి దూరం కావడంతో అతన్ని కీలక టోర్నీలకు దూరం పెట్టింది టీమిండియా మేనేజ్‌మెంట్. చాహార్ గాయపడకపోయి ఉంటే ఆసియా కప్ 2022 టోర్నీతో పాటు టీ20 వరల్డ్ కప్ 2022 టీమ్‌లోనూ కచ్ఛితంగా ఉండేవాడు...

Deepak Chahar

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో మొదటి ఓవర్‌లో 1 పరుగు మాత్రమే ఇచ్చిన దీపక్ చాహార్, భవుమా‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఐపీఎల్‌లోనూ దీపక్ చాహార్, పవర్ ప్లేలో ఇలాంటి బౌలింగ్ పర్ఫామెన్సే చూపించాడు. టీమిండియా తరుపున ఆడిన మ్యాచుల్లోనూ చాహార్‌ నుంచి ఇలాంటి స్పెల్స్ వచ్చాయి.

దీపక్ చాహార్‌, జస్ప్రిత్ బుమ్రా కలిసి ఓపెనింగ్ స్పెల్ వేస్తే... మధ్య ఓవర్లలో హర్షల్ పటేల్‌ని కొనసాగించి, డెత్ ఓవర్లలో అర్ష్‌దీప్ సింగ్, బుమ్రాని వేయిస్తే... టీమిండియాకి తిరుగు ఉండదని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. మరి అభిమానుల విన్నపాన్ని సెలక్టర్లు, టీమిండియా మేనేజ్‌మెంట్ పట్టించుకుంటుందా? మరికొన్ని రోజుల్లో తేలనుంది...

click me!