ధావన్ రావాలి, షమీ కావాలి, శాంసన్‌ని తేవాలి... ఆసియా కప్‌లో టీమిండియా ఓటమితో...

First Published Sep 7, 2022, 8:14 PM IST

గెలుస్తూ ఉంటే ఏం చేసినా చెల్లుతుంది. ఒక్కసారి ఓడితే చాలు... విమర్శించడానికి వెయ్యి నోళ్లు సిద్ధంగా ఉంటాయి. అలాంటిది టీమిండియా వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి, ఆసియా కప్ 2022 ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. దీంతో భారత జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. టీమిండియాలో సంచలన మార్పులు చేయాలని డిమాండ్లు చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు...

ఐపీఎల్‌లో గత కొన్ని సీజన్లుగా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తున్నాడు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్. అయితే టీ20 టీమ్‌లో మాత్రం ధావన్‌కి అవకాశం ఇవ్వడం లేదు టీమిండియా. నిలకడగా పర్ఫామెన్స్ ఇస్తున్నా అతని స్ట్రైయిక్ రేటు తక్కువగా ఉందని కారణంగా చూపుతోంది...

Shikhar Dhawan

‘శిఖర్ ధావన్‌కి టీ20ల్లో అవకాశం ఇవ్వాలి. శిఖర్ ధావన్ నిలకడగా పరుగులు చేయగలడు. ప్రతీ ఏడాది ఐపీఎల్‌లో అతను చేస్తున్న పరుగులు, గబ్బర్ అవసరం ఏంటో తెలియచేస్తున్నాయి. టీ20ల్లో అలాగే ఆడాలనే రూల్ పెట్టుకుంటే ఫలితాలు ఇలాగే వస్తాయి...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత మహ్మద్ షమీని టీ20 ఫార్మాట్‌కి దూరంగా పెట్టింది భారత జట్టు. వన్డే, టెస్టు ఫార్మాట్‌లో షమీని కొనసాగిస్తూ... టీ20ల్లో మాత్రం భువీతో పాటు ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ వంటి ప్లేయర్లకు అవకాశాలు ఇస్తూ వచ్చింది...

‘మహ్మద్ షమీ లాంటి బౌలర్‌ని టీమిండియా మేనేజ్‌మెంట్, సెలక్టర్లు ఎందుకు పక్కనబెట్టారో నాకైతే అర్థం కావడం లేదు. షమీ ఉండి ఉంటే భారత బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉండి ఉండేది...’ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

Sanju Samson

ఐపీఎల్‌లో, టీమిండియా తరుపున టీ20ల్లో నిలకడైన పర్ఫామెన్స్ ఇస్తున్నప్పటికీ ఆసియా కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు భారత వికెట్ కీపర్ సంజూ శాంసన్. అతని స్థానంలో ఈ ఏడాది టీ20ల్లో విఫలమవుతూ వచ్చిన రిషబ్ పంత్‌కే ప్రాధాన్యం ఇచ్చింది బీసీసీఐ...

Sanju Samson

‘టీ20ల్లో రిషబ్ పంత్‌ కంటే సంజూ శాంసన్ బెస్ట్ ఛాయిస్. రిషబ్ పంత్‌కి ఇచ్చిన ఛాన్సుల్లో సగం సంజూకి ఇచ్చినా అతను టాప్ క్లాస్ ప్లేయర్ అవుతాడు. సంజూ ఉండి కనీసం వేగంగా పరుగులు చేసేవాడు... వికెట్ కీపింగ్‌లో ఆకట్టుకునేవాడు’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా...

click me!