బాయ్‌కాట్ ఐపీఎల్! దానివల్లే టీమిండియాకి ఈ పరిస్థితి... భారత క్రికెట్ ఫ్యాన్స్ డిమాండ్...

Published : Sep 07, 2022, 05:33 PM IST

ఇంగ్లాండ్ టీమ్, యాషెస్ సిరీస్‌లో 4-0 తేడాతో ఓడిన తర్వాత తమ ఓటమికి ఐపీఎల్‌యే కారణమంటూ చాడీలు చెప్పింది. కీ ప్లేయర్లు, ఐపీఎల్ కోసం ప్రాక్టీస్‌కి డుమ్మా కొట్టారని, అందుకే యాషెస్ సిరీస్‌లో ఓడామంటూ చెప్పి తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. తాజాగా ఆసియా కప్ 2022 టోర్నీలో భారత జట్టు ఓటమితో టీమిండియా ఫ్యాన్స్ కూడా ఐపీఎల్‌ని బాయ్‌కాట్ చేయాలని డిమాండ్ చేస్తుండడం విశేషం...

PREV
17
బాయ్‌కాట్ ఐపీఎల్! దానివల్లే టీమిండియాకి ఈ పరిస్థితి... భారత క్రికెట్ ఫ్యాన్స్ డిమాండ్...
Ravi Shastri and Virat Kohli

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలోనూ భారత జట్టు వరుసగా రెండు మ్యాచుల్లో ఓడింది. అయితే అప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ, రవిశాస్త్రి కోచింగ్ కారణంగానే భారత జట్టు, సెమీస్ కూడా చేరలేకపోయిందని సరిపెట్టుకున్నారు భారత అభిమానులు...

27
rohit sharma

అయితే ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన రోహిత్ శర్మపై భారీ అంచనాలు ఉన్నాయి. రోహిత్ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ 2022, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలను భారత జట్టు గెలుస్తుందని నమ్మకం పెట్టుకున్నారు టీమిండియా అభిమానులు. అయితే ఆసియా కప్‌లోనే వారికి భారీ షాక్ తగిలింది...

37
Mumbai Indians

పెద్దగా ఫామ్‌లో లేని పాకిస్తాన్, శ్రీలంకలపై వరుస మ్యాచుల్లో ఓడి ఫైనల్ రేసు నుంచి దాదాపు తప్పుకుంది భారత జట్టు. ఈ పరాభవాన్ని భారత అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఐపీఎల్‌ సక్సెస్‌ చూసి, టీమిండియా కెప్టెన్సీ అప్పగిస్తే రోహిత్ ఇలా చేశాడేంటా? అని కొందరు ఫీల్ అవుతుంటే.. ఐపీఎల్ మీద పెట్టిన శ్రద్ధ, బీసీసీఐ... భారత జట్టుపై పెట్టడం లేదంటున్నారు మరికొందరు...

47
Image credit: IPL

ఐపీఎల్ 2023-27 ప్రసార హక్కుల విక్రయం ద్వారా రూ.48 వేల కోట్లు ఆర్జించింది బీసీసీఐ. ఈ ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు ఐపీఎల్‌ను 74 రోజుల నుంచి 90 రోజులకు పొడగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది భారత క్రికెట్ బోర్డు. ఫ్రాంఛైజీ క్రికెట్ ద్వారా కోట్లు సంపాదించడంలో పెట్టిన శ్రద్ధ, టీమిండియాకి సరైన ప్లేయర్లను ఎంపిక చేయడంలో పెట్టడం లేదనేది ఫ్యాన్స్ ఆవేదన...

57
KL Rahul

ఐపీఎల్‌లో గత మూడు సీజన్లలో 600+ పరుగులు చేసిన కెఎల్ రాహుల్, ఆసియా కప్ 2022 టోర్నీలో నాలుగు మ్యాచుల్లో కలిపి కూడా 50 పరుగులు కూడా చేయలేకపోయాడు. దీంతో ఐపీఎల్ ద్వారా కోట్లు సంపాదించే అవకాశం దొరకడంతో ప్లేయర్లు, దేశానికి ఆడడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే వాదన కూడా వినిపిస్తోంది...

67

20 ఓవర్ల పాటు వికెట్ కీపింగ్ చేసి, గాయపడిన తర్వాత కూడా పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్... పాక్ జట్టుకి విజయాన్ని అందించడానికి 17 ఓవర్ల వరకూ బ్యాటింగ్ చేశాడు. భారత ప్లేయర్లు మాత్రం రెండు మ్యాచులు ఆడగానే రెస్ట్ కావాలనే, సిరీస్‌లకు దూరమవుతున్నారు...

77
Image credit: PTI

కేవలం ఐపీఎల్ వల్ల కోట్లు సంపాదించడంతో భారత జట్టుకి ప్రతీ మ్యాచ్ ఆడాలనే ఆసక్తి ప్లేయర్లలో తగ్గిపోయిందని, ఈ ఏడాది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ వంటి సీనియర్లు ఆడిన మ్యాచులకంటే రెస్ట్ తీసుకున్న మ్యాచుల సంఖ్యే ఎక్కువగా ఉండడం దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణగా చూపిస్తూ... ఐపీఎల్‌ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ #BoyCottIPL హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు భారత జట్టు అభిమానులు..  

Read more Photos on
click me!

Recommended Stories