రిషబ్ పంత్ టీ20లకు పనికి రాడు, ఇకనైనా సంజూ శాంసన్‌కి చోటు ఇవ్వండి... ఆసియా కప్ రిజల్ట్‌తో...

First Published Sep 7, 2022, 7:01 PM IST

టన్నుల్లో టాలెంట్ ఉందని నిరూపించుకున్నా, రావాల్సినన్ని అవకాశాలు రాని ప్లేయర్లలో సంజూ శాంసన్ ఒకడు. అప్పుడెప్పుడో 7 ఏళ్ల క్రితం టీ20ల్లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సంజూ శాంసన్, ఇప్పటిదాకా ఆడింది 16 మ్యాచులే. గత ఏడాది అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సూర్యకుమార్ యాదవ్, ఇప్పటికే 25 టీ20లు ఆడిస్తే... సంజూ శాంసన్ మాత్రం అప్పుడప్పుడు అలా వచ్చి, ఇలా మాయమవుతున్నాడు...

Sanju Samson

ఆసియా కప్ 2022 టోర్నీలో రిషబ్ పంత్ విఫలం కావడంతో మరోసారి సంజూ శాంసన్ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ ఏడాది రిషబ్ పంత్‌కి రెస్ట్ ఇచ్చిన కొన్ని మ్యాచుల్లో సంజూ శాంసన్‌కి అవకాశం కల్పించింది టీమిండియా. ఆ మ్యాచుల్లో సంజూ శాంసన్ సగటు 44.75గా ఉంది...

Sanju Samson

ఇదే సమయంలో రిషబ్ పంత్ కేవలం 24.90 సగటుతో మాత్రమే పరుగులు చేశాడు. వన్డేల్లో, టెస్టుల్లో అదరగొడుతున్నా టీ20ల్లో మాత్రం రిషబ్ పంత్‌ నుంచి ఆశించిన పర్ఫామెన్స్ అయితే రావడం లేదు. అదీగాక రిషబ్ పంత్ 120+ స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుంటే, సంజూ శాంసన్ 150+ సగటుతో పరుగులు చేశాడు...

Sanju Samson Player of the match

వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో వికెట్ల వెనకాల చిరుతలా కదిలాడు సంజూ శాంసన్. డ్రైవ్‌లు చేస్తూ అదనపు పరుగులు రాకుండా అడ్డుకున్నాడు. అంతేకాకుండా మెరుపులా కదులుతూ స్టంపౌట్లు, రనౌట్లు చేయడంలో సంజూ శాంసన్, రిషబ్ పంత్ కంటే చాలా బెటర్...

Sanju Samson-DK-Ashwin

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్, అటు బ్యాటింగ్‌లో, ఇటు వికెట్ కీపింగ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో ఇప్పటిదాకా రిషబ్ పంత్‌ని పట్టుకుని పాకులాడింది చాలని, ఇకనైనా సంజూ శాంసన్‌కి అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు...

Sanju Samson

టీ20 వరల్డ్ కప్‌కి పెద్దగా సమయం లేదు. ఆసియా కప్ 2022 రిజల్ట్ చూసిన తర్వాత టీమిండియా సంచలన నిర్ణయాలు తీసుకోకపోతే మరోసారి భంగపాటు తప్పదు. కాబట్టి వీలైనంత త్వరగా జట్టులోకి సంజూ శాంసన్‌ని తీసుకొచ్చి, టీ20లకు పనికి రాని రిషబ్ పంత్‌ని వన్డే, టెస్టులకు పరిమితం చేయాలంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్.. 

click me!