రెండో టీ20లో 8 మార్పులతో టీమిండియా... మనీశ్ పాండేకి మరో లక్కీ ఛాన్స్...

First Published Jul 27, 2021, 7:13 PM IST

శ్రీలంక టూర్‌లో ఉన్న భారత జట్టు సభ్యుడైన కృనాల్ పాండ్యా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం నిర్వహించిన పరీక్షల్లో కృనాల్‌కి పాజిటివ్ రావడంతో రెండో టీ20 మ్యాచ్‌ను రేపటికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు...

కరోనా పాజిటివ్‌గా తేలిన కృనాల్ పాండ్యాకి జ్వరం లేదు, స్వల్పంగా గొంతు నొప్పితో పాటు కొద్దిగా ఒళ్లునొప్పులతో బాధపడుతున్నట్టు తేల్చారు వైద్యులు...
undefined
కృనాల్ పాండ్యాతో క్లోజ్ కాంటాక్ట్ ఉన్న 8 మంది క్రికెటర్లనూ ఐసోలేషన్‌కి తరలిస్తున్నట్టు మీడియా సమావేశంలో ప్రకటించాడు బీసీసీఐ సెక్రటరీ జై షా...
undefined
ఇంగ్లాండ్ టూర్‌కి ఎంపికైన పృథ్వీషాతో పాటు సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఐసోలేషన్‌లో ఉన్న ప్లేయర్లలో ఉన్నారు...
undefined
లంక టూర్‌లో ఉన్న భారత బృందంతో పాటు వీరిందరికీ కరోనా పరీక్షలు నిర్వహించబోతోంది బీసీసీఐ. ఈ 8 మందికి నెగిటివ్ వచ్చినా, ప్రోటోకాల్ ప్రకారం తప్పనిసరిగా వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది...
undefined
దీంతో రెండు, మూడో టీ20 మ్యాచుల్లో కొత్త కుర్రాళ్లకు అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే శ్రీలంక టూర్‌కి ఎంపికైన వరుణ్ చక్రవర్తి, చేతన్ సకారియా, కృష్ణప్ప గౌతమ్, నితీశ్ రాణా... అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసేశారు...
undefined
దేవ్‌దత్ పడిక్కల్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్ మాత్రమే లంక టూర్‌కి ఎంపికై అంతర్జాతీయ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నవారిలో ఉన్నారు. కృనాల్ పాండ్యాతో క్లోజ్ కాంటాక్ట్ ఉన్నవారిలో వీళ్లు లేకపోతే, రేపు జరిగే మ్యాచ్‌లో వీళ్లు బరిలో దిగడం ఖాయం...
undefined
అలాగే వన్డే సిరీస్‌లో పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయిన సీనియర బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండేకి కూడా మరో లక్కీ ఛాన్స్ దొరకవచ్చు...
undefined
మనీశ్ పాండే తుదిజట్టులో ఉన్న గత 14 టీ20 మ్యాచుల్లో భారత జట్టు ఓడిపోయింది లేదు. పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వకపోయినా, టీ20ల్లో లక్కీ ప్లేయర్‌గా మారిన మనీశ్ పాండే, రెండో టీ20లో ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి...
undefined
లంకతో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత జూలై 30న ఇంగ్లాండ్ ఫ్లైయిట్ ఎక్కాల్సిన పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్‌లపై మాత్రం కృనాల్ పాండ్యా పాజిటివ్ ఎఫెక్ట్ పడనుంది...
undefined
కృనాల్ పాండ్యాతో క్లోజ్ కాంటాక్ట్ ఉన్న వారిలో ఉన్న ఈ ఇద్దరూ, క్వారంటైన్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లనున్నారు. ఇక్కడే క్వారంటైన్ గడుపుతుండడంతో ఇంగ్లాండ్‌లో 14 రోజుల క్వారంటైన్‌ను మూడు రోజులకు కుదించేలా ఇంగ్లీష్ బోర్డును కోరనుంది బీసీసీఐ.
undefined
click me!