జింబాబ్వేతో సిరీస్‌లు పెడుతున్న ఆ జీనియస్‌ ఎవరో చూడాలని ఉంది... పాక్ మాజీ కెప్టెన్...

First Published Jul 27, 2021, 6:20 PM IST

సంవత్సరంలో సగానికి సగం జింబాబ్వేతో సిరీస్‌లు ఆడడం పాకిస్తాన్‌కి అలవాటు. ఇంగ్లాండ్ సిరీస్‌లో ఒకే ఒక్క టీ20 మ్యాచ్ గెలిచిన పాకిస్తాన్, ఇప్పుడు మళ్లీ తమ ప్రతాపాన్ని చూపించడానికి జింబాబ్వే టూర్‌కి రెఢీ అవుతోంది. దీంతో పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఈ విషయంపై సిరీయస్ అయ్యాడు...

‘నేను జింబాబ్వే టూర్లు ఆర్గనైజ్ చేస్తున్న జీనియస్ ఎవరో, అతన్ని కలవాలని అనుకుంటున్నా. అతన్ని కలిసి ‘పాకిస్తాన్ క్రికెట్ అభివృద్ధికి ఎంతో పాటుపడుతూ గొప్ప పని చేస్తున్నావని’ మెచ్చుకోవాలని ఉంది...
undefined
జింబాబ్వేతో సిరీస్‌లు ఆడడం వల్ల పాక్ క్రికెట్‌కి ఎలాంటి ఉపయోగం లేదు. నాలుగేళ్లకోసారి జింబాబ్వే టూర్ జరిగితే ఓకే, కానీ పెద్ద జట్లతో ఓడిన ప్రతీసారీ పసికూన జట్టుతో ఆడి ఏం నిరూపించుకోవాలని అనుకుంటున్నారు...
undefined
పసికూన జింబాబ్వేతో ఆడుతూ మీ ర్యాంకులు మెరుగుపర్చుకుంటూ, భారత జట్టుతో పోల్చుకుంటూ, భారత క్రికెటర్ల కంటే మనవాళ్లు గొప్పవాళ్లు అని చెప్పుకోవడానికి తప్ప ఈ టూర్లు ఎందుకూ ఉపయోగపడవు...
undefined
టీమిండియా పదేళ్ల క్రితమే పద్ధతి మార్చేసింది. క్రికెట్ అభివృద్ధి కోసం ఏం చేయాలో పక్కగా తెలుసుకుని, అదే చేస్తోంది. వాళ్లు డబ్బులు పెడుతున్నారు, అద్భుతమైన ప్రొఫెషనల్ క్రికెటర్లను తయారుచేస్తున్నారు...
undefined
నా ప్రియమైన పాక్ ప్రజలారా... దయచేసి క్రికెట్‌ను బాగుచేయండి. ముఖ్యంగా చదువుకున్నవాళ్లు, కాల్స్ చేయడం ఆపేయండి, జట్టులోకి తీసుకోమని రికమెండ్ చేయడం మానుకోండి...
undefined
ఇది 21వ శతాబ్దం... జట్టును ఎంపిక చేయడానికి ముందు నాకు అనేక కాల్స్ వస్తున్నాయి. ఫలానా క్రికెటర్‌ను తీసుకోండా, ఈ ప్లేయర్‌ను ఆడించండి... అంటూ రికమెంట్ చేస్తున్నారు..
undefined
ఇలాంటి మమ్మల్ని తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నాయి. దయచేసి మమ్మల్ని ఫలానా ప్లేయర్‌ను తీసుకోమని కోరే బదులు, ఆ క్రికెటర్‌ను సరిగా ఆడమనండి...’ అంటూ చెప్పుకొచ్చాడు మాజీ క్రికెటర్ వసీం అక్రమ్...
undefined
పాకిస్తాన్ క్రికెట్ సెలక్షన్ కమిటీలో సభ్యుడైన వసీం అక్రమ్, జట్టు ఎంపికలో స్వేచ్ఛ ఉండడం లేదని వాపోయాడు...
undefined
click me!