మునాఫ్ పటేల్ కెరీర్ అర్ధాంతరంగా ఎందుకు ముగిసింది... 2011 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ హీరోకి...

First Published Jul 12, 2022, 11:53 AM IST

ఐపీఎల్ 2022 ద్వారా వెలుగులోకి వచ్చిన ఉమ్రాన్ మాలిక్, ఇప్పుడు టీమిండియాలో హాట్ టాపిక్ అయిపోయాడు. 150+ కి.మీ.ల వేగంతో బౌలింగ్ వేస్తున్న ఉమ్రాన్ మాలిక్, టీమిండియాకి ఫ్యూచర్ డేల్ స్టెయిన్ అవుతాడని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. అయితే కెరీర్ ఆరంభంలో టీమిండియాలోకి ఈ విధంగా ఆరంగ్రేటం చేసిన ఫాస్ట్ బౌలర్ మునాఫ్ పటేల్...

టీమిండియాలో ఫాస్ట్ బౌలర్లు 120-130 కి.మీ.ల వేగాన్ని అందుకోవడానికే అష్టకష్టాలు పడుతున్న సమయంలో 140 కి.మీ.ల వేగాన్ని అందుకున్న బౌలర్ మునాఫ్ పటేల్.. ఆరంగ్రేటం టెస్టులోనే అదరగొట్టిన మునాఫ్ పటేల్, 2007 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ టీమ్స్‌లో సభ్యుడిగా ఉన్నాడు...

2004లో ఇండియా ఏ కోచ్‌ సందీప్ పాటిల్, మునాఫ్ పటేల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘గాయాల కారణంగా మునాఫ్ పటేల్ మెంటల్ ప్రాబ్లెమ్ ఫేస్ చేస్తున్నాడని’ వ్యాఖ్యానించాడు...

Latest Videos


మునాఫ్ పటేల్ బౌలింగ్ యాక్షన్ మెరుగుపరిచేందుకు ఆస్ట్రేలియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్‌కి పంపించింది బీసీసీఐ. ఇంగ్లాండ్ టూర్‌లో బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ తరుపున ఆడిన మునాఫ్ పటేల్, ఆ మ్యాచ్‌లో 10 వికెట్లు తీసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు...

అలా మొహాలీలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆరంగ్రేటం చేసిన మునాఫ్ పటేల్, తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 25 పరుగులకే 4 వికెట్లు పడగొట్టి... అదరగొట్టాడు.. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలగడం మునాఫ్ పటేల్ బౌలింగ్ స్పెషాలిటీ...  

మునాఫ్ పటేల్ స్పీడ్‌ని భారత ఫీల్డర్లు అందుకోలేకపోయారు. మునాఫ్ ఎంట్రీ ఇచ్చిన కొత్తలో స్లిప్‌లో వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి సీనియర్లు క్యాచులు డ్రాప్ చేయడంతో దీని గురించి చాలా పెద్ద చర్చే జరిగింది...

2011 వన్డే వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన మునాఫ్ పటేల్, ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు సచిన్ టెండూల్కర్ 120, యువరాజ్ సింగ్ 58, గౌతమ్ గంభీర్ 51 కారణంగా 338 పరుగులకి ఆలౌట్ అయ్యింది...
 

ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసిన మునాఫ్ పటేల్, ఆఖరి బంతికి 2 పరుగులు ఇవ్వకుండా ఇంగ్లాండ్ బ్యాటర్లను నిలువరించాడు. దీంతో ఈ మ్యాచ్‌ని టై చేసుకుంది భారత జట్టు... 

పాకిస్తాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 43 పరుగులు చేసిన మహ్మద్ హఫీజ్, అబ్దుల్ రజాక్‌లను అవుట్ చేసిన మునాఫ్ పటేల్... ఆ సిరీస్‌లో 8 మ్యాచుల్లో 11 వికెట్లు తీసి భారత జట్టు తరుపున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా ఉన్నాడు...

6 అడుగుల 3 ఇంచుల పొడుగు ఉండే మునాఫ్ పటేల్, 2011 ఇంగ్లాండ్ టూర్ తర్వాత టీమిండియాలో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత గాయాలతో సతమతమవుతూ భారత జట్టులోకి రాలేకపోయాడు మునాఫ్ పటేల్...

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్ తరుపున ఆడిన మునాఫ్ పటేల్, 2017 తర్వాత ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించలేకపోయాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన మునాఫ్ పటేల్, లంక ప్రీమియర్ లీగ్‌లో క్యాండీ టస్కర్స్‌కి ఆడాడు...

click me!