అసలే ఫామ్‌లో లేడు, ఆపై గాయం... విరాట్ కోహ్లీని వెంటాడుతున్న బ్యాడ్ లక్..

Published : Jul 12, 2022, 10:30 AM IST

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టైమ్ ఏ మాత్రం బాగోలేనట్టు కనిపిస్తోంది... అసలే పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడుతూ టీ20 టీమ్‌లో ప్లేస్‌ని సందిగ్ధంలో పడేసుకున్న భారత మాజీ కెప్టెన్, వన్డే సిరీస్‌లోనూ ఆడడం అనుమానంగా మారింది...

PREV
17
అసలే ఫామ్‌లో లేడు, ఆపై గాయం... విరాట్ కోహ్లీని వెంటాడుతున్న బ్యాడ్ లక్..

2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీని బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. కేప్‌టౌన్ టెస్టు తర్వాత మనస్థాపంతో టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ...

27
Image credit: Getty

ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో 1 పరుగు చేసి అవుటైన విరాట్ కోహ్లీ, రెండో టీ20లో ఓ ఫోర్, ఓ సిక్సర్ బాది జోరు మీద కనిపించినా 11 పరుగులకే పెవిలియన్ చేరి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు...

37

టీ20ల్లో ఫామ్ సరిగ్గా లేకపోయినా వన్డేల్లో మాత్రం విరాట్ కోహ్లీ బాగానే ఉంది. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు వన్డేల్లో రెండు హాఫ్ సెంచరీలు బాదాడు విరాట్. ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్ 3లో ఉన్న విరాట్, ఇంగ్లాండ్‌తో జరిగే తొలి వన్డేలో ఆడడం అనుమానంగా మారింది...
 

47

సోమవారం ప్రాక్టీస్ సెషన్స్‌లో విరాట్ కోహ్లీ పాల్గొనలేదు. దీనికి కారణం విరాట్ కోహ్లీ గాయంతో బాధపడుతున్నాడట. మూడో టీ20లో విరాట్ కోహ్లీ గజ్జల్లో గాయమైందని, దాని నుంచి కోలుకోవడానికి అతనికి కొంత సమయం పడుతుందని సమాచారం...

57

తొలి వన్డేకి దూరంగా ఉండే విరాట్ కోహ్లీ, ఆ తర్వాత జూలై 14న జరిగే రెండో వన్డేలో ఆడతాడని సమాచారం. 2008లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన విరాట్ కోహ్లీ, తన 14 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో గాయం కారణంగా తప్పుకున్న మ్యాచులు నాలుగే..

67

2022 ఆరంభంలో జరిగిన జోహన్‌బర్గ్ టెస్టులో మెడనొప్పితో బాధపడుతూ బరిలో దిగలేదు విరాట్ కోహ్లీ. అయితే ఆ తర్వాతి మ్యాచ్ తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో కోహ్లీ కావాలనే గాయం వంకతో రెండో టెస్టుకి దూరమై ఉంటాడనే అనుమానాలు రేగాయి...

77

అసలే ఫామ్‌లో లేక పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీని గాయాలు కూడా బాధపెడుతండడంతో అతను సెంచరీ చేస్తే చూడాలనే అభిమానుల కలలు, కల్లలు గానే మిగులుతాయా? అని అనుమానిస్తున్నారు ఫ్యాన్స్... 

Read more Photos on
click me!

Recommended Stories