Virat Kohli : సచిన్ ‘శతకాల’’ రికార్డు బద్ధలు.. సెంచరీ తర్వాత కోహ్లీ సెలబ్రేషన్స్ మామూలుగా లేవుగా

Siva Kodati |  
Published : Nov 15, 2023, 06:47 PM IST

టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. పరిమిత క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ పేరిట వున్న రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. కేవలం 279 ఇన్నింగ్స్‌ల్లోనే కోహ్లీ 50 సెంచరీల మార్క్‌ను అందుకున్నాడు.

PREV
16
Virat Kohli : సచిన్ ‘శతకాల’’ రికార్డు బద్ధలు.. సెంచరీ తర్వాత కోహ్లీ సెలబ్రేషన్స్ మామూలుగా లేవుగా
Virat Kohli Century

కివీస్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు వరకు ఒక ప్రపంచకప్‌లో 8 సార్లు 50 ప్లస్ ఇన్నింగ్స్‌లు ఆడిన బ్యాటర్‌గా కోహ్లీ రికార్డుల్లోకెక్కాడు. అలాగే ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలోనూ విరాటుడిదే అగ్రస్థానం. 
 

26
Virat Kohli Century

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 సెంచరీలతో పాటు మరో సచిన్ రికార్డునూ కోహ్లీ అధిగమించాడు. 2003లో సచిన్ టెండూల్కర్ సాధించిన 673 పరుగులే ఇప్పటి వరకు ఒక ప్రపంచకప్‌లో ఓ క్రికెటర్ సాధించిన మొత్తం రన్స్. ఈ రికార్డును కోహ్లీ తాజా వరల్డ్ కప్‌లో అధిగమించేశాడు. 

36
Virat Kohli Century

ఇంతకుముందు మాథ్యూ హేడెన్ 2007లో, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ 2019లో సచిన్ టెండూల్కర్ రికార్డుకు దగ్గరగా వచ్చినా 673 పరుగుల మ్యాజిక్ ఫిగర్‌ని మాత్రం అందుకోలేకపోయారు. సచిన్ టెండూల్కర్ 2003 వన్డే వరల్డ్ కప్‌లో 11 ఇన్నింగ్స్‌ల్లో 673 పరుగులు చేస్తే, విరాట్ కోహ్లీ 10 ఇన్నింగ్స్‌ల్లోనూ ఆ రికార్డును బ్రేక్ చేసేశాడు. 
 

46
Virat Kohli Century

ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ నిలిచాడు విరాట్ కోహ్లీ. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 731 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 740 పరుగులకు చేరుకుని మరో రికార్డును తన పేరిట లిఖించాడు. 
 

56
kohli

వన్డేల్లో సచిన్ సెంచరీల రికార్డును బద్ధలు కొట్టిన తర్వాత విరాట్ కోహ్లీ మైదానంలోని ప్రేక్షకులకు తన బ్యాట్‌తో అభివాదం చేశారు. ఈ సందర్భంగా గ్యాలరీలో వున్న తన సతీమణి అనుష్క శర్మకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఆమెకు అలాగే భర్తకు కిస్ ఇచ్చింది. 

66
kohli

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో టాప్ 3కి అధిగమించాడు విరాట్ కోహ్లీ. 13704 పరుగులు చేసిన రికీ పాంటింగ్‌ని దాటేసిన విరాట్ కోహ్లీ, 18426 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్, 14234 పరుగులు చేసిన కుమార సంగర్కర తర్వాతి స్థానంలో నిలిచాడు. 

Read more Photos on
click me!

Recommended Stories