20 ఏళ్ల ముందు సౌరవ్ గంగూలీ... ఇప్పుడు విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్! ఇండియా- న్యూజిలాండ్ సెమీస్‌లో..

First Published | Nov 15, 2023, 6:24 PM IST

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా లీగ్ స్టేజీని పూర్తిగా డామినేట్ చేసింది. నాకౌట్ మ్యాచుల్లో ఎలా ఆడతారో అనే భయాన్ని పూర్తిగా తుడిచి పెట్టేశారు భారత బ్యాటర్లు...
 

ముంబైలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అదిరిపోయే ఆరంభం అందించగా... విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ రికార్డు సెంచరీలతో చెలరేగారు. 

Shreyas

వన్డే కెరీర్‌లో 50వ సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ, ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు 2003 వన్డే వరల్డ్ కప్‌లో సౌరవ్ గంగూలీ మాత్రమే ఈ ఫీట్ సాధించాడు.

Latest Videos


Virat Kohli-Shreyas Iyer

విరాట్ కోహ్లీ తర్వాత శ్రేయాస్ అయ్యర్ కూడా సెంచరీతో చెలరేగాడు. 2003 సెమీ ఫైనల్‌లో కెన్యాపై సౌరవ్ గంగూలీ సెంచరీ చేయగా, గత 20 ఏళ్లల్లో ఏ క్రికెటర్ కూడా సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీలు అందుకోలేకపోయారు..

ఒకే వరల్డ్ కప్‌ ఎడిషన్‌లో 700+ పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు...
 

వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచుల్లో అత్యధిక స్కోరు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. 2003 వరల్డ్ కప్ సెమీస్‌లో సౌరవ్ గంగూలీ 111 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో 117 పరుగులు చేసి టాప్‌లో నిలిచాడు..
 

Shreyas Iyer

మిడిల్ ఆర్డర్‌లో 500+ పరుగులు చేసిన మొట్టమొదటి ప్లేయర్‌గా శ్రేయాస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా ఒకే వరల్డ్ కప్‌లో రెండు సెంచరీలు చేసిన భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కూడా శ్రేయాస్ అయ్యరే..
 

ఒకే వరల్డ్ కప్‌లో ఒకే జట్టుకి చెందిన ముగ్గురు బ్యాటర్లు 500+ పరుగులు చేయడం ఇదే మొదటిసారి. విరాట్ కోహ్లీ 711 పరుగులు చేయగా రోహిత్ శర్మ 550, శ్రేయాస్ అయ్యర్ 526 పరుగులతో టాప్ 5లో ఉన్నారు...

Virat Kohli

వన్డే వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచుల్లో ఇదే అత్యధిక స్కోరు. భారత జట్టు, న్యూజిలాండ్‌పై 397/4 పరుగులు చేయగా ఇంతకుముందు 2015 వరల్డ్ కప్ సెమీస్‌లో వెస్టిండీస్‌పై న్యూజిలాండ్ 393/6 పరుగులు చేసింది.

click me!