తన జెర్సీ నెంబర్ సీక్రెట్ బయటపెట్టిన ఇషాన్ కిషన్... కుల్దీప్ యాదవ్ వల్ల అది వదిలి...

First Published Jan 27, 2023, 3:15 PM IST

టీమిండియా క్రికెటర్లు ధరించే జెర్సీ నెంబర్లకు కూడా క్రికెట్‌లో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సచిన్ టెండూల్కర్ ధరించిన ‘10’ నెంబర్‌ జెర్సీని శార్దూల్ ఠాకూర్‌కి కేటాయించడంతో అప్పట్లో రచ్చ రేగింది. దీంతో శార్దూల్ జెర్సీ నెంబర్‌ని మార్చేసింది బీసీసీఐ... తాజాగా ఇషాన్ కిషన్, తన జెర్సీ నెంబర్ వెనకున్న సీక్రెట్‌ని బయటపెట్టాడు...

Image credit: Getty

మహేంద్ర సింగ్ ధోనీ స్వస్థలం అయిన జార్ఖండ్‌లోని రాంఛీ నుంచి వచ్చిన ఇషాన్ కిషన్,తన మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. బంగ్లాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్.. అరుదైన ప్లేయర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు...

Image credit: PTI


‘నిజానికి నేను జెర్సీ నెంబర్ 23 తీసుకోవాలని అనుకున్నా. కానీ అప్పటికే ఆ నెంబర్ కుల్దీప్ యాదవ్ తీసుకున్నాడు. దాంతో వేరే నెంబర్ ఏదైనా తీసుకోవాల్సి వచ్ిచంది. మా అమ్మని కాల్ చేసి అడిగితే 32 తీసుకోవాలని చెప్పింది...

ishan

అమ్మ చెప్పిందనే ఉద్దేశంతోనే 32 జెర్సీ తీసుకున్నా. 5 నా లక్కీ నెంబర్. అందుకే 2+3 కావాలనుకున్నా కానీ 3+2 దక్కింది. 14 ఏళ్ల వయసులో జార్ఖండ్‌కి వచ్చినప్పటి నుంచి టీమిండియా క్రికెటర్ కావాలని కలలు కన్నాను...

ishan

నేను మహేంద్ర సింగ్ ధోనీకి వీరాభిమానిని. ధోనీ ఆటను చూస్తూ పెరిగాను. నేను కూడా జార్ఖండ్ నుంచే వచ్చాను. అందుకే మాహీ ప్లేస్‌ని నేనే రిప్లేస్ చేయాలని ఆశపడ్డాను. మాహీ భాయ్‌లాగే టీమిండియాకి చాలా మ్యాచులు గెలిపించాలని అనుకుంటున్నా...

నాకు 18 ఏళ్లు ఉన్నప్పుడు మొదటిసారి ధోనీని చూశా... ఆ రోజు మాహీతో ఆటోగ్రాఫ్ తీసుకున్నా. మాహీని కలవాలనే కల తీరిన రోజు సంతోషంతో నిద్ర కూడా పోలేకపోయాను.

Ishan Kishan

నా దగ్గర ఇప్పటికీ ఆ ఆటోగ్రాఫ్ ఉంది. మాహీ ఆటోగ్రాఫ్ చేసిన బ్యాటుని నా లక్కీ బ్యాటుగా భావిస్తా...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత క్రికెటర్ ఇషాన్ కిషన్.. 

click me!