టీమిండియా, విరాట్ కోహ్లీపైనే ఎక్కువ ఆధారపడి ఉంది! బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ కామెంట్స్...

First Published Jan 27, 2023, 12:04 PM IST

టెస్టుల్లో ఆల్‌టైం మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో విరాట్ కోహ్లీ ఒకడు. అత్యధిక విజయాలు అందుకున్న టెస్టు సారథుల్లో నాలుగో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ, 2022 జనవరిలో అర్ధాంతరంగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీనికి కారణం అప్పటి బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీతో ఉన్న విభేదాలే..

Kohli-Ganguly

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ. అయితే వన్డే, టెస్టుల్లో కెప్టెన్‌గా కొనసాగాలని భావించాడు కోహ్లీ. అయితే అతన్ని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. వన్డేల్లో అత్యధిక విజయాల శాతం ఉన్న విరాట్‌ని కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం... టీమిండియాలో సంచలన మార్పులను తీసుకొచ్చింది...

వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్టు అధికారిక ప్రకటన వెలువరించడానికి 15 నిమిషాల ముందే చెప్పారని ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో విరాట్ కోహ్లీ ఆవేదన వ్యక్తం చేయడం, సౌరవ్ గంగూలీ దాన్ని ఖండించడంతో ఈ విషయం గురించి చాలా రోజులు చర్చ జరిగింది...

వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న కొన్ని రోజులకే టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు విరాట్ కోహ్లీ. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో విభేదాలే కారణమని వినిపించింది..

rohit kohli ganguly

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత కొన్ని రోజులకే బీసీసీఐ అధ్యక్ష పదవిని కోల్పోయాడు సౌరవ్ గంగూలీ. కోహ్లీని తప్పించినట్టే, గంగూలీని ఆ పదవి నుంచి బలవంతంగా తప్పించింది భారత క్రికెట్ బోర్డు...

కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత కొన్నాళ్లు పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడ్డ విరాట్ కోహ్లీ, గత ఏడాదిని ఘనంగా ముగించాడు. 2022 ఏడాదిలో రెండు సెంచరీలు చేసిన కోహ్లీ, గత ఏడాది ఆఖర్లో సెంచరీతో ముగించాడు...
 

kohli ganguly

‘విరాట్ కోహ్లీ చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. బంగ్లాదేశ్‌పైన కూడా సెంచరీ సాధించాడు. అయితే టెస్టుల్లో విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావాలి...

ఎందుకంటే టెస్టుల్లో టీమిండియా, విరాట్ కోహ్లీపై ఎక్కువగా ఆధారపడ ఉంది. ఆస్ట్రేలియా లాంటి టీమ్‌పై విజయం సాధించాలంటే విరాట్ కోహ్లీ బ్యాటుతో రాణించడం చాలా అవసరం...

ganguly kohli

ఇండియా, ఆస్ట్రేలియా రెండూ టెస్టుల్లో అదరగొడుతున్నాయి. ఈ రెండు జట్లు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడతాయనే అనుకుంటున్నా. అది జరగాలంటే టీమిండియా, టెస్టు సిరీస్ గెలవాలి. అలా గెలవాలంటే కోహ్లీ ఫామ్‌లోకి రావాలి...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ...
 

click me!