మొదటి టీ20 వరల్డ్‌కప్ ‘బాల్‌ అవుట్’ విజయానికి 14 ఏళ్లు... పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో...

First Published Sep 14, 2021, 12:34 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ... భారత క్రికెట్‌లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పేరు. 2004లో టీమిండియాకి ఎంట్రీ ఇచ్చినా, అయితే భారత క్రికెట్‌లో ధోనీ శకం మొదలైంది మాత్రం 2007లోనే... 

2007 వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా గ్రూప్ స్టేజ్‌ నుంచే నిష్కమించింది... టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగి, పసికూన బంగ్లాదేశ్ చేతుల్లో చిత్తుగి ఓడింది... 

ఆ మ్యాచ్ తర్వాత ఒక్కసారిగా భారత క్రికెట్ ఫ్యాన్స్, టీమిండియా క్రికెటర్లపై విద్వేషాన్ని వెళ్లగక్కారు. క్రికెటర్ల ఇళ్లపై దాడులు జరిగాయి. మాహీ దిష్టిబొమ్మలను దహనం చేసి, అతని ఇంటిపై రాళ్లదాడి చేశారు...

మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ ఇదే... అప్పటిదాకా టీమిండియాలో యంగ్ సూపర్ స్టార్‌గా అభిమానులతో కీర్తించబడిన మాహీ, ఈ అవమానాన్ని కసిగా స్వీకరించాడు...

2007 వన్డే వరల్డ్‌కప్ పరాజయం ఇచ్చిన భయంతో రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, జహీర్ ఖాన్ వంటి సీనియర్లు... మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ పాల్గొనడానికి ఇష్టపడలేదు...

2007 వన్డే వరల్డ్‌కప్ పరాజయం ఇచ్చిన భయంతో రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, జహీర్ ఖాన్ వంటి సీనియర్లు... మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ పాల్గొనడానికి ఇష్టపడలేదు...

దీంతో యువకులతో నిండిన జట్టును టీ20 వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీలో నడిపించే బాధ్యత మహేంద్ర సింగ్ ధోనీకి దక్కింది...

అప్పటికే జట్టులో యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ వంటి సీనియర్లు ఉన్నా, సచిన్ టెండూల్కర్ రిఫరెన్స్‌తో మాహీని కెప్టెన్‌గా నియమించారు సెలక్టర్లు...

అదే ఆరంభం... టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు అద్భుతం చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగి, టైటిల్ విన్నర్‌గా నిలిచి... చరిత్ర క్రియేట్ చేసింది...

టీ20 వరల్డ్‌కప్‌ 2007లో మిగిలిన మ్యాచులన్నీ ఒక ఎత్తు అయితే... గ్రూప్ స్టేజ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ కెప్టెన్‌గా మాహీ సామర్థ్యం ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది...

స్కోర్లు టైగా ముగియడంతో విన్నర్‌ని తేల్చేందుకు ‘బాల్ అవుట్’ పద్ధతిని ఎంచుకున్నారు సెలక్టర్లు. భారత జట్టు తరుపున ముగ్గురికి ముగ్గురు వికెట్లను గిరాటేయగా... పాకిస్తాన్ తరుపున మొదటి నలుగురు వికెట్లను మిస్ చేశారు...

అప్పటి పాక్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ వికెట్ల పక్కన నిల్చొని వికెట్ కీపింగ్ చేయగా... మాహీ మాత్రం వికెట్ల వెనకాలే కూర్చుని, బంతిని ఎలా వేయాలో బౌలర్లకు అర్థమయ్యేలా చేశాడు... 

ఇప్పటికీ ఈ మ్యాచ్‌కి సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ టోర్నీ తర్వాత బాల్‌ అవుట్ స్థానంలో సూపర్ ఓవర్‌‌ను చేర్చింది ఐసీసీ...

click me!