టీ20 వరల్డ్‌కప్‌కి అతన్ని ఎందుకు ఎంపిక చేయలేదు... మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజనీర్ ఫైర్...

Published : Sep 14, 2021, 10:26 AM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ప్రకటించిన భారత జట్టులో భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌లకు చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. 

PREV
110
టీ20 వరల్డ్‌కప్‌కి అతన్ని ఎందుకు ఎంపిక చేయలేదు... మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజనీర్ ఫైర్...

ఐపీఎల్‌లో అదరగొడుతున్న శిఖర్ ధావన్‌ను టీ20 వరల్డ్‌కప్‌కి ఎంపిక చేయకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు భారత మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజనీర్..

210

suryakumar yadav

‘టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో సూర్యకుమార్ యాదవ్‌కి చోటు దక్కిందని తెలిసి, చాలా సంతోషించా. సూర్యకుమార్ యాదవ్, దీనికి పూర్తిగా అర్హుడు కూడా...

310

రాహుల్ చాహార్ కూడా చాలా చక్కని బౌలర్. ఈ ఇద్దరికీ ఎంపిక చేయడం చాలా మంచి నిర్ణయం... జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మలతో జట్టు చాలా సమతౌల్యంతో కనిపిస్తోంది...

410

టీమ్ బ్యాలెన్స్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే శిఖర్ ధావన్‌ను ఎంపిక చేయకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది...

510

అతను టీ20ల్లో బాగా ఆడుతున్నాడు. ఐపీఎల్‌ 2020లో కెఎల్ రాహుల్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గానూ నిలిచాడు...

610

శిఖర్ ధావన్‌ను ఎంపిక చేయకపోవడం, భారత జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అతని ప్రతిభకీ, ఇప్పుడున్న ఫామ్‌కి ధావన్‌ని కచ్ఛితంగా ఎంపిక చేయాల్సింది...

710

తాను ఏం చేయగలడో ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నాడు శిఖర్ ధావన్. అతని స్థానాన్ని లాగేసుకునేంత సత్తా ఉన్న ప్లేయర్ ఎవరూ నాకు కనిపించడం లేదు..

810

కెఎల్ రాహుల్ బాగా ఆడుతున్నాడు. అతను ఇప్పుడు జట్టుకి చాలా అవసరం. ప్రస్తుత తరంలో బెస్ట్ బ్యాట్స్‌మెన్లలో ఒకడు. రోహిత్ శర్మ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు... అతనో సూపర్ స్టార్...

910

అలాగే శిఖర్ ధావన్‌ని కూడా ఎంపిక చేయాల్సింది. టీ20 వరల్డ్‌కప్ గెలవడానికి దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోకూడదు... అలాంటి అవకాశమే ధావన్...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజనీర్...

1010

టీమిండియా తరుపున 66 టీ20 మ్యాచులు ఆడిన శిఖర్ ధావన్, 11 హాఫ్ సెంచరీలతో 1719 పరుగులు చేశాడు.. 
ఐపీఎల్ 2020 సీజన్‌లో వరుసగా రెండు సెంచరీలు చేసిన శిఖర్ ధావన్, 600+ పరుగులు చేసి ‘ఆరెంజ్ క్యాప్’ విన్నర్ కెఎల్ రాహుల్, డేవిడ్ వార్నర్ తర్వాతి స్థానంలో నిలిచాడు... 

click me!

Recommended Stories