రహానేకి కోహ్లీ గురించి తెలుసు... విరాట్ లేకున్నా టీమిండియాను గెలిపించగలడని తెలుసు...

First Published Dec 14, 2020, 6:16 PM IST

అజింకా రహానే... ఒకప్పుడు భారత జట్టుకి భావి రాహుల్ ద్రావిడ్ అవుతాడని భావించిన క్రికెటర్. అయితే టీ20, వన్డే ఫార్మాట్‌లో రహానేకి జట్టులో ప్రాధాన్యం తగ్గింది. వేగంగా పరుగులు చేయలేకపోవడంతో జట్టులో చోటు కూడా కోల్పోయాడు అజింకా రహానే. అయితే టెస్టుల్లో మాత్రం వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ గైర్హజరీతో ఆస్ట్రేలియాలో మూడు టెస్టులకి సారథ్యం వహించబోతున్నాడు రహానే...

అజింకా రహానే చాలా కూల్ అండ్ కామ్ ప్లేయర్. విరాట్ కోహ్లీతో పోలిస్తే రహానేలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ పెద్దగా కనిపించవు...
undefined
ఆస్ట్రేలియా లాంటి ప్రత్యర్థిపై అజింకా రహానే కెప్టెన్‌గా వ్యవహారించడం కరెక్టు కాదని చాలామంది మాజీలు అభిప్రాయపడ్డారు. దూకుడైన ప్లేయర్ కెప్టెన్‌గా మారితే బాగుంటుందని సలహాలు ఇచ్చారు.
undefined
అయితే ఇప్పటికే ఆస్ట్రేలియాలో ఓ టెస్టు మ్యాచ్‌లో ఓడించిన అజింకా రహానే...ఈసారి మూడు టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించడానికి వెయిట్ చేస్తున్నాడు.
undefined
ఇదే విషయాన్ని ప్రస్తావించాడు భారత మాజీ కెప్టెన్, క్రికెటర్ సునీల్ గవాస్కర్. ‘ఆసీస్ గడ్డపై ఎలా వ్యవహారించాలనేది అజింకా రహానేకి బాగా తెలుసు...
undefined
‘రహానే చాలా కూల్. కెప్టెన్సీ అతనికి భారం కాదు. ఎందుకంటే ఇంతకుముందే టీమిండియాకు రెండు టెస్టు మ్యాచుల్లో కెప్టెన్‌గా వ్యవహారించి సక్సెస్ అయ్యాడు రహానే...
undefined
ధర్మశాలలో ఆస్ట్రేలియా లాంటి పటిష్ట ప్రత్యర్థిని చిత్తు చేయగలిగింది రహానే అండ్ టీమ్. ఆఫ్ఘాన్‌పై దక్కిన వన్‌సైడ్ విక్టరీ కూడా రహానే కెప్టెన్సీ సిల్క్స్‌కి నిదర్శనం..
undefined
విరాట్ కోహ్లీ లేకపోతే మరింత బాధ్యతగా వ్యవహారించాలని జట్టుకు చెబుతాడు రహానే... కోహ్లీ లేని ఇంపాక్ట్ తెలియకుండా జట్టును నడిపిస్తాడు...
undefined
అతను కేవలం మూడు టెస్టులకి మాత్రమే కెప్టెన్. విరాట్ కోహ్లీ స్థానంలో పూర్తిగా కెప్టెన్‌గా నియమించలేదనే విషయం అతనికి తెలుసు... కాబట్టి సారథ్యం అనేది రహానేకి ఎలాంటి ఒత్తిడి కాబోదు..’ అని చెప్పాడు సునీల్ గవాస్కర్.
undefined
గత పర్యటనలో అద్భుత ప్రదర్శన ఇచ్చిన ఛతేశ్వర పూజారా... ఈసారి కూడా అదరగొడతాడని, రహానే అండతో చెలరేగిపోతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు సునీల్ గవాస్కర్.
undefined
click me!