ఒక్క సెంచరీ లేకుండా 460 రోజులు... ‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లీకి ఏమైంది...

First Published | Feb 26, 2021, 4:09 PM IST

విరాట్ కోహ్లీ... ఐసీసీ దశాబ్దపు మేల్ క్రికెటర్‌గా నిలిచిన లెజెండరీ బ్యాట్స్‌మెన్. ఐసీసీ ప్రకటించిన దశాబ్దపు అవార్డుల్లో మూడు ఫార్మాట్లలోనూ చోటు దక్కించుకున్న ఒకే ఒక్క క్రికెటర్... ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ క్రియేట్ చేసిన రికార్డులే లక్ష్యంగా దూసుకొచ్చిన విరాట్ కోహ్లీ, కెరీర్‌లో మొట్టమొదటిసారిగా సెంచరీ మార్కు అందుకోవడానికి తెగ కష్టపడుతున్నాడు...

Team India Captain Virat Kohli fans waiting for his Century almost 460 days CRA
విరాట్ కోహ్లీ చివరిసారి నవంబర్ 2019లో బంగ్లాదేశ్‌పై జరిగిన టెస్టులో సెంచరీ బాదాడు. కోల్‌కత్తా టెస్టులో విరాట్ కోహ్లీ 136 పరుగులు చేశాడు. ఆ తర్వాత మూడు ఫార్మాట్లలో కలిపి 35 ఇన్నింగ్స్‌లో ఆడిన విరాట్ కోహ్లీ... సెంచరీ మార్కు మాత్రం అందుకోలేకపోయాడు...
Team India Captain Virat Kohli fans waiting for his Century almost 460 days CRA
లాక్‌డౌన్ తర్వాత జరిగిన ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభంలో పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడ్డాడు విరాట్ కోహ్లీ. ఈ కారణంగా కోహ్లీ ఫామ్‌పైన తీవ్రమైన ట్రోలింగ్ కూడా వచ్చింది.

అయితే 2020 ఐపీఎల్ సీజన్ మధ్యలో ఫామ్‌ను అందుకున్న విరాట్ కోహ్లీ, 15 మ్యాచుల్లో 466 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలతో పాటు 90 పరుగులతో అజేయంగా నిలిచిన ఇన్నింగ్స్ కూడా ఉంది...
ఐపీఎల్‌లో ఫామ్ అందుకున్న విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా టూర్‌లో 71వ అంతర్జాతీయ సెంచరీ అందుకుంటాడని భావించారు అభిమానులు. కానీ మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులతో పాటు ఆడిలైడ్ టెస్టులో కూడా సెంచరీ చేయలేకపోయాడు విరాట్ కోహ్లీ...
కెరీర్ ఆరంభించిన తర్వాత మూడు ఫార్మాట్లలో ఒక్క సెంచరీ కూడా లేకుండా ఓ ఏడాదిని ముగించడం కోహ్లీకి ఇదే మొదటిసారి. పెటర్నిటీ లీవ్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ మార్కు అందుకోలేకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.
మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగులకే అవుటైన కోహ్లీ, రెండో ఇన్నింగ్స్‌లో 72 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన కోహ్లీ, రెండో ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేశాడు...
పింక్ బాల్ టెస్టులో మంచి యావరేజ్, రికార్డు ఉన్న విరాట్ కోహ్లీ... ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగే డే నైట్ టెస్టులో సెంచరీ మార్కు అందుకుంటాడని అభిమానులు ఆశించారు. కానీ 27 పరుగులకే పెవిలియన్ చేరిన కోహ్లీ, మరోసారి ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు...
నిజానికి విరాట్ కోహ్లీ మరీ అంత ఘోరమైన ఫామ్‌లో ఏం లేడు. 2020 డిసెంబర్ నుంచి జరిగిన ఏడు ఇన్నింగ్స్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలు చేశాడు కోహ్లీ. కానీ ఇంతకుముందులా హాఫ్ సెంచరీని, శతకంగా మార్చడంలో విఫలమవుతున్నాడు భారత సారథి...
విరాట్ కోహ్లీ 71వ సెంచరీ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు... ఓ వైపు కోహ్లీతో పోటీపడే స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్, జో రూట్ లాక్‌డౌన్ తర్వాత శతకాల మోత మోగించారు. ముగ్గురూ కూడా ద్విశతకాలను అందుకున్నారు. కానీ కోహ్లీ మాత్రం 71వ శతకం కోసం ఎదురుచూస్తున్నాడు...
మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీ 99.1 మిలియన్ల ఫాలోవర్లను దాటి 100 మిలియన్ల వైపు దూసుకుపోతున్నాడు. విరాట్ కోహ్లీ 71వ సెంచరీ కొట్టేలోపు ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్ల మార్కును కొట్టనుందని అంచనా వేస్తున్నారు అభిమానులు...
టీమిండియా విజయాలను అందుకుంటున్నా, విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం లేదనే బాధ అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది. బౌలర్లు ఎంత అద్భుతంగా రాణించినా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సెంచరీలు చేస్తే వచ్చే కిక్ వేరేగా ఉంటుంది. రోహిత్ శర్మ సెంచరీ అందుకోగా, విరాట్ కోహ్లీ కమ్ బ్యాక్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు క్రికెట్ఫ్యాన్స్...

Latest Videos

click me!