నేను బాల్ మెకానిక్‌ని కాదు, బ్యాట్స్‌మెన్‌ని... రోహిత్ శర్మ ఫన్నీ రిప్లై...

First Published | Feb 26, 2021, 3:26 PM IST

విరాట్ కోహ్లీతో పోలిస్తే, రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడే తీరు పూర్తిగా వేరుగా ఉంటుంది. కొట్టినట్టుగా మాట్లాడే రోహిత్ శర్మ, స్ట్రాంగ్ రిప్లై ఇస్తూ, రిపోర్టర్లకు షాకిస్తూ ఉంటాడు. తాజాగా పింక్ బాల్ టెస్టు విజయం తర్వాత జరిగిన మీడియా సమావేశంలో కూడా ఇలాంటి సంఘటనే ఎదురైంది....

రెండో టెస్టులో అద్భుత సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ, మూడో టెస్టులోనూ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 66 పరుగులు చేసిన రోహిత్ శర్మ, రెండో ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేసి, భారీ సిక్సర్‌తో టెస్టును ముగించాడు...
‘పింక్ బాల్ టెస్టులో బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. నేను ఎప్పుడూ వికెట్ కాపాడుకోవాలని ఆడను. అలా ఆలోచిస్తే త్వరగా అవుట్ అయిపోతాం... నేను కొట్టడానికే వచ్చాను, బౌండరీలు బాదుతాను అనే అనుకుంటాను.

అలా ఎదురుదాడికి దిగితే, బౌలర్ మీద ఒత్తిడి పెరుగుతుంది... డిఫెన్స్ ఆడుతూ ఉంటే, బౌలర్‌కి నమ్మకం పెరుగుతుంది. మరింత గట్టిగా ప్రయత్నిస్తే, వికెట్ వస్తుందని భావిస్తారు.
అదే షాట్స్ ఆడుతూ పరుగులు రాబడుతూ ఉంటే, బౌలర్‌కి ఒత్తిడికి గురై, పరుగులు నియంత్రించడానికి మాత్రమే ప్రయత్నిస్తాడు... చాలామంది పిచ్ గురించి కామెంట్ చేస్తున్నారు. రెండో టెస్టు జరిగిన పిచ్‌తో పోలిస్తే, ఈ వికెట్‌ చాలా భిన్నంగా ఉంది.
అక్కడ బంతి టర్న్ అయ్యింది. ఇక్కడ ఎక్కువమంది బ్యాట్స్‌మెన్ స్ట్రైయిట్ బాల్స్‌కే అవుట్ అయ్యారు... పెద్దగా టర్న్ అవ్వలేదు..అయితే చెన్నై పిచ్‌లో నేను సెంచరీ చేశాను, అశ్విన్ సెంచరీ చేశాడు. అజింకా రహానే, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ హాఫ్ సెంచరీలు చేశారు.
కానీ ఇక్కడ అలాంటి బ్యాటింగ్ చూపించలేకపోయాం. కారణం మేం కూడా వాళ్లలాగే బ్యాటింగ్‌లో తప్పులు చేశాం...’ అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ.
ఈ పిచ్‌ మీద ఎస్‌జీ పింక్ బాల్ కారణంగా పేస్‌కి టర్న్‌కి చాలా వ్యత్యాసం వచ్చిందంటారా? అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు రోహిత్ శర్మ. ‘నాకు తెలీదు. నేను బాల్ ఎక్స్‌పర్ట్‌నో, మెకానిక్‌నో కాదు. నేను నా చేతిలో బ్యాటును పట్టుకుంటాను... నాకు అర్థమైనంతవరకూ కుకబుర బాల్ స్పిన్ బౌలింగ్‌లో మరింత వేగంగా దూసుకొస్తోంది... ’ అంటూ చెప్పాడు రోహిత్ శర్మ...
‘పింక్ బాల్ టెస్టులో మొత్తం 30 మంది బ్యాట్స్‌మెన్ అవుట్ అయ్యారు. కానీ మనం గమనిస్తే పిచ్ కారణంగా అవుట్ అయ్యినట్టు ఏ వికెట్ కూడా కనిపించలేదు. బ్యాట్స్‌మెన్ ఆడిన షాట్ల కారణంగా, షాట్స్ ఆడడంతో బ్యాట్స్‌మెన్ చేసిన పొరపాట్ల కారణంగా వికెట్లు కోల్పోయాం...
ఇక్కడ ఎలాంటి రఫ్ వికెట్ కనిపించలేదు... అక్షర్ పటేల్ పక్కా లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశాడు. బ్యాట్స్‌మెన్ లైన్ మిస్ అయితే, వికెట్ పడింది... ’ అంటూ కామెంట్ చేశాడు రోహిత్ శర్మ...

Latest Videos

click me!