ఐపీఎల్‌ తోపు, పీఎస్‌ఎల్‌కి అంత సీన్ లేదు... పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా...

Published : Feb 25, 2022, 03:19 PM IST

పాకిస్తాన్‌లో మెజారిటీ క్రికెట్ ఫ్యాన్స్‌‌ని అడిగితే ఐపీఎల్ కంటే పాక్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) చాలా బెస్ట్ అంటూ తెగ మోసేస్తూ ఉంటారు. కొందరు పాక్ మాజీ క్రికెటర్లు కూడా అంతే. అయితే పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా మాత్రం ఐపీఎల్ ది బెస్ట్ అంటున్నాడు...  

PREV
110
ఐపీఎల్‌ తోపు, పీఎస్‌ఎల్‌కి అంత సీన్ లేదు... పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా...

ఐపీఎల్ ఆరంభానికి ముందు పాకిస్తాన్ పర్యటనకు వెళ్తోంది ఆస్ట్రేలియా జట్టు. 1998 తర్వాత ఆస్ట్రేలియా జట్టు, పాక్‌లో పర్యటించడం ఇదే తొలిసారి...

210

ఈ పర్యటనలో పాకిస్తాన్‌తో కలిసి మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడనుంది ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్...

310

టెస్టులు ముగిసిన తర్వాత డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ప్యాట్ కమ్మిన్స్ వంటి స్టార్ ప్లేయర్లు, నేరుగా పాకిస్తాన్ నుంచి ఐపీఎల్‌ కోసం ఇండియాకి రాబోతున్నారు...

410

పాకిస్తాన్‌లో పర్యటించబోయే ఆస్ట్రేలియా క్రికెటర్లకు విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేశాయి ఆయా ఐపీఎల్ ఫ్రాంఛైజీలు...

510

‘పాక్‌లో పర్యటించే ఆస్ట్రేలియా ప్లేయర్లకు ఆల్‌ ది బెస్ట్ తెలుపుతూ ఐపీఎల్ ఫ్రాంఛైజీలు పోస్టులు చేయడం చాలా ఆనందాన్నిచ్చింది... 

610

ఇండియా ఎప్పుడూ క్రికెట్‌ను, క్రికెటర్లను సపోర్ట్ చేస్తుంటుంది. ఐపీఎల్‌, వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ లీగ్. ఐపీఎల్‌కి మించిన లీగ్ మరోటి లేదు.

710

నిజానికి బిగ్ బాష్ లీగ్ కానీ, పాక్ సూపర్ లీగ్ కానీ ఐపీఎల్‌కి దగ్గరకు కూడా రాలేవు. ఐపీఎల్‌ ద్వారా క్రికెట్ ప్రపంచంలోకి వచ్చిన ప్లేయర్లు ఎందరో...

810

చాలాసార్లు పాక్‌కి వచ్చిన జట్లు, వెనక్కి వెళ్లిపోతే అందరూ భారత్‌ని తిడతారు. అంతేనా పాకిస్తాన్ టూర్‌కి దూరంగా ఉండాలని ఏ క్రికెటర్ అనుకున్నా, దానికి కూడా ఇండియానే అంటారు...

910

ఏం జరిగినా కూడా దానికి భారత్‌నే తప్పుబడతారు. అయితే వాళ్లు మాత్రం అవేమీ పట్టించుకోరు. ఎందుకంటే వాళ్లు క్రికెట్‌కి ఇచ్చే గౌరవం అలాంటిది...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా...

1010

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ముందు పాకిస్తాన్ పర్యటనకి వెళ్లిన న్యూజిలాండ్ జట్టు, మరికొద్ది నిమిషాల్లో వన్డే సిరీస్ ప్రారంభమవుతుందని సెక్యూరిటీ కారణాలతో అర్ధాంతరంగా టూర్‌ను క్యాన్సిల్ చేసుకుంది...

click me!

Recommended Stories