రితికాతో కలిసి బ్రేక్ టైమ్ ఎంజాయ్ చేస్తున్న రోహిత్ శర్మ... వదిలిపెట్టని ట్రోలర్స్...

First Published Sep 10, 2022, 11:03 PM IST

టీ20 వరల్డ్ కప్ 2007, వన్డే వరల్డ్ కప్ 2011 టోర్నీల్లో టీమిండియాకి విజేతగా నిలిపినా ఎంఎస్ ధోనీ కూడా అభిమానుల నుంచి అనేక సార్లు ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచి, విరాట్ కోహ్లీ కంటే బెటర్ కెప్టెన్ అంటూ పొడగ్తలు దక్కించుకున్న రోహిత్ శర్మ,  ఆసియా కప్ 2022 టోర్నీ పరాజయంతో అదే పొజిషన్‌లో ఉన్నాడు...

ఆసియా కప్ టోర్నీలో భారత జట్టు సూపర్ 4 స్టేజీకి పరిమితం కావడంతో భారత జట్టు అనుకున్న షెడ్యూల్ కంటే నాలుగు రోజులు ముందుగానే స్వదేశానికి పయనమైంది. అయితే భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం దుబాయ్‌లోనే హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు.

భార్య రితికాతో కలిసి రొమాంటిక్ డేట్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు రోహిత్ శర్మ. అయితే ఈ ఫోటోలపై కూడా నెటిజన్లు దాడి చేస్తున్నారు... ఫిట్‌నెస్‌ లేని నువ్వు, కెప్టెన్‌గా పనికి రావని, వెంటనే ఆ పొజిషన్‌ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

rohit sharma

వరుసగా ఐదు మ్యాచులు ఆడడానికి ఆసక్తి ఉండదు కానీ యాడ్స్ చేయడానికి, భార్యతో కలిసి ఇలా డేట్స్‌కి వెళ్లడానికి మాత్రం రోహిత్ శర్మ దగ్గర చాలా సమయం ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు టీమిండియా ఫ్యాన్స్...

rohit sharma

మరికొందరు మాత్రం రోహిత్‌కి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఆసియా కప్ 2022 టోర్నీలో ఫెయిల్ అయినా రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలుస్తుందని... అప్పటిదాకా ఎదురుచూడాలని కామెంట్లు చేస్తున్నారు... 

ఆసియా కప్ 2018 టోర్నీలో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా భారత జట్టుకి టైటిల్ అందించాడు. ఆ సమయంలోనే టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా అవకాశం వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ కామెంట్ చేశాడు రోహిత్...

Image credit: PTI

అయితే విరాట్ కోహ్లీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకోవడానికి రోహిత్ శర్మ, మరో మూడేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీ20, వన్డే కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న రోహిత్ శర్మ, సౌతాఫ్రికా టూర్ తర్వాత టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు కూడా తీసుకున్నాడు...

rohit sharma

ద్వైపాక్షిక సిరీసుల్లో అద్భుత విజయాలు అందుకున్న రోహిత్ టీమ్, ఆసియా కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో ఓడి ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది. ఈ రెండూ ఓటములకు టాస్‌యే కారణమంటూ వ్యాఖ్యానించాడు రోహిత్ శర్మ... 

click me!