ఊర్వశి ఎవరో కూడా నాకు తెలీదు... బాలీవుడ్ హీరోయిన్‌కి షాక్ ఇచ్చిన నసీం షా...

Published : Sep 10, 2022, 09:17 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీలో టీమిండియా ఆడిన మ్యాచుల్లో మెరుపులా మెరిసింది బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెల్లా. కొన్నిరోజుల క్రితం భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో ఎఫైర్ గురించి కామెంట్లు చేసి, సోషల్ మీడియా వేదికగా రచ్చ చేసిన ఊర్వశి... పాక్ యంగ్ క్రికెటర్ నసీం షా కోసమే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచులకు వస్తోందని వార్తలు వచ్చాయి...

PREV
17
ఊర్వశి ఎవరో కూడా నాకు తెలీదు... బాలీవుడ్ హీరోయిన్‌కి షాక్ ఇచ్చిన నసీం షా...

పాకిస్తాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌కి వచ్చిన ఊర్వశి రౌతెల్లా, ఆ తర్వాత సూపర్ 4 రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌ సమయంలోనూ స్టేడియంలో మెరిసింది. తొలి మ్యాచ్‌లో రిషబ్ పంత్ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు...

27
(Photo source- https://www.instagram.com/p/CcfFx9pKuDk/)

రెండో మ్యాచ్‌లో మాత్రం రిషబ్ పంత్ తుదిజట్టులో ఉన్నా పెద్దగా పరుగులు చేయలేకపోయాడు. ఈ మ్యాచ్ సమయంలో నసీం షా నవ్వుతున్న సీన్స్‌ని తన వీడియోకి జోడించి సోషల్ మీడియాలో పోస్టులు చేసింది ఊర్వశి రౌతెల్లా... దీంతో కొత్త రూమర్లు వినిపించాయి.

37
(Photo source- https://www.instagram.com/p/CcfFx9pKuDk/)

రిషబ్ పంత్‌ బ్రేకప్ చెప్పిన తర్వాత కొత్త తోడు కోసం చూస్తున్న ఊర్వశి రౌతెల్లా, పాక్ క్రికెటర్ నసీం షా కోసమే పాకిస్తాన్ ఆడే మ్యాచులకు వస్తోందని వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై ఊర్వశి రౌతెల్లా స్పందించలేదు కానీ ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో ఆఖర్లో రెండు సిక్సర్లు బాది హీరోగా మారిపోయిన నసీం షాకి దీని గురించి ప్రశ్న ఎదురైంది...

47

ఆసియా కప్ 2022 ఫైనల్ మ్యాచ్‌కి ముందు నసీం షాని ఇంటర్వ్యూ చేసిన ఓ రిపోర్టర్, ‘ఊర్వశి రౌతెల్లా మీకోసం, మిమ్మల్ని చూడడం కోసం పాకిస్తాన్ ఆడే మ్యాచులకు వస్తోందని అంటున్నారు. దీనిపై మీరేమంటారు...’ అంటూ ప్రశ్నించాడు...
 

57

దానికి నవ్విన నసీం షా... ‘నాకు ఊర్వశి ఎవరో కూడా తెలీదు. అందుకే నవ్వు వచ్చింది. కొందరు నాకు వీడియోలు పంపుతూ ఉంటారు. నాకు అవన్నీ పట్టించుకోను. నాలో ఎలాంటి స్పెషాలిటీ లేదు. నా ఫోకస్ అంతా క్రికెట్‌పైనే...

67

క్రికెట్ చూసి నన్ను ప్రేమించే, గౌరవించే వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నా...’ అంటూ కామెంట్ చేశాడు నసీం షా. 19 ఏళ్ల నసీం షా, పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో తొడ కండరాలు పట్టేసినా బౌలింగ్ చేసి క్రికెట్ ఫ్యాన్స్ మనసు దోచుకున్నాడు...

77

మనసు పడ్డ రిషబ్ పంత్‌ ఏమో... చీప్ పబ్లిసిటీ కోసం నన్ను వాడుకోవద్దు అక్కో అంటూ కామెంట్ చేస్తే... ఇప్పుడు నసీం షా ఏకంగా ఆమె ఎవరో కూడా నాకు తెలీదంటూ వ్యాఖ్యలు చేసి ఊర్వశి రౌతెల్లా పరువు తీసేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...

Read more Photos on
click me!

Recommended Stories