హనీమూన్ టైమ్ ముగిసింది, ఇకనైనా సీరియస్‌గా పనిచేయ్... రాహుల్ ద్రావిడ్‌పై మాజీ క్రికెటర్ ఫైర్...

Published : Sep 10, 2022, 08:42 PM IST

రాహుల్ ద్రావిడ్, టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 8 మంది కెప్టెన్లు మారారు. ఓపెనింగ్ దగ్గర్నుంచి అన్ని బ్యాటింగ్ పొజిషన్లలోనూ అనేక రకాల ప్రయోగాలు చేసింది భారత జట్టు. సంజూ శాంసన్, దినేశ్ కార్తీక్, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ వంటి వికెట్ కీపర్లను మార్చింది...

PREV
17
హనీమూన్ టైమ్ ముగిసింది, ఇకనైనా సీరియస్‌గా పనిచేయ్... రాహుల్ ద్రావిడ్‌పై మాజీ క్రికెటర్ ఫైర్...

డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆసియా కప్ 2022 టోర్నీని మొదలెట్టిన భారత జట్టు, సూపర్ 4 రౌండ్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది. ఈ వరుస పరాజయాలతో కెప్టెన్ రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్‌లపై విమర్శలు రావడం మొదలయ్యాడు...

27
Image credit: PTI

ఆసియా కప్‌కి ముందు ద్వైపాక్షిక సిరీసుల్లో రకరకాల ప్రయోగాలు చేసినా పట్టించుకోని మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు... ఒక్కసారిగా రాహుల్ ద్రావిడ్ కోచింగ్ స్టైల్‌ని, రోహిత్ శర్మ కెప్టెన్సీని విమర్శిస్తూ ట్రోల్ చేయడం మొదలెట్టారు...

37
Image credit: PTI

‘రాహుల్ ద్రావిడ్‌కి ఇప్పటికే హానీమూన్ టైమ్ అయిపోయిందని అర్థమై ఉండాలి. భారత హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్లేయర్లతో సీరియస్‌గా ఉండకుండా చనువుగా ఉండేందుకు అన్నివిధాల ప్రయత్నించాడు రాహుల్ ద్రావిడ్...

47
Image credit: Getty

అయితే ముడిసరుకు నుంచి మనకు కావాల్సిన వస్తువు తయారుచేయాలంటే దాన్ని వంచి తీరాల్సిందే. రాహుల్ ద్రావిడ్ నుంచి అందరూ ఆశించింది అదే. అయితే ద్రావిడ్ మాత్రం దానికి భిన్నంగా వ్యవహరించాడు. అతనికి ఇది క్లిష్టమైన సమయం...

57
Image credit: Getty

టీ20 వరల్డ్ కప్ 2022, వన్డే వరల్డ్ కప్ 2023 రాబోతున్నాయి. కీలక టోర్నీలకు ముందు ఆసియా కప్ 2022 టోర్నీలో ఇలా ఓడడం రాహుల్ ద్రావిడ్‌ని ప్రెషర్‌లోకి నెట్టేసి ఉండొచ్చు. ఇండియా ఈ రెండు వరల్డ్ కప్స్ గెలవాలంటే రాహుల్ ద్రావిడ్ చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది...
 

67
Image credit: PTI

రాహుల్ ద్రావిడ్‌కి ఉన్న టాలెంట్‌కి అతని శిక్షణలో టీమిండియా సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవాల్సింది, ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టును కూడా వన్‌సైడ్ చేయాల్సింది కాని అలా జరగలేదు.కారణం ద్రావిడ్ రిలాక్స్ అవ్వడమే...

77
Rahul Dravid

రాహుల్ ద్రావిడ్ ఎప్పుడూ ఛాలెంజ్‌లు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. స్టార్ ప్లేయర్లు టీమ్‌లో ఉన్నా, టాప్ క్లాస్ మ్యాచ్ విన్నర్లు ఉన్నా మ్యాచులు గెలవడానికి కావాల్సిన ఫ్యాక్టర్‌ని మిస్ అవుతోంది టీమిండియా. దాన్ని ద్రావిడ్ మాత్రమే తీసుకురాగలడు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సబా కరీం.. 

click me!

Recommended Stories