ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నుంచి పాఠాలు నేర్చుకున్నాడు కానీ... హార్ధిక్ పాండ్యాపై...

First Published Jun 20, 2022, 4:05 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కెరీర్ గ్రాఫ్‌ని అమాంతం మార్చేసింది. గత రెండు సీజన్లలో పర్ఫామెన్స్ కారణంగా టీమిండియాలో చోటు కోల్పోయి, ముంబై ఇండియన్స్ జట్టుకి దూరమైన హార్ధిక్ పాండ్యా... ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా తొలి సీజన్‌లోనే టైటిల్ గెలిచి చరిత్ర క్రియేట్ చేశాడు...

Image credit: PTI

ఐపీఎల్ 2022 సీజన్‌లో బ్యాటుతో 487 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, బాల్‌తోనూ 8 వికెట్లు తీసి అదరగొట్టాడు. ఫైనల్ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి, ‘మ్యాన్ ఆఫ్ ది ఫైనల్’ గెలిచాడు...

Image credit: PTI

రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ తరుపున ఆరంగ్రేటం చేసిన హార్ధిక్ పాండ్యా, ఆ తర్వాత ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా తరుపున మ్యాచులు ఆడాడు...

Latest Videos


Image credit: PTI

‘హార్ధిక్ పాండ్యా ఐదారేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. అతను వచ్చినప్పటి నుంచి ముగ్గురు, నలుగురు కెప్టెన్లతో కలిసి పనిచేశాడు. నేను సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి హార్ధిక్ పాండ్యాని చూస్తున్నా...

Image credit: PTI

అతను ప్రతీ ఏడాది మరింత మెరుగవుతున్నాడు. గాయం కారణంగా కొంత కాలం క్రికెట్‌కి దూరమై ఉండొచ్చు కానీ అతనిలో క్రికెటర్‌ మాత్రం రెస్ట్ తీసుకోలేదు. అందుకే అతని లైఫ్ స్టైల్ దగ్గర్నుంచి ఆట స్టైల్‌ దాకా అన్నింట్లోనూ మెచ్యూరిటీ చూపిస్తున్నాడు...

Image credit: PTI

వెన్నెముక సర్జరీ తర్వాత కోలుకుని బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ హార్ధిక్ పాండ్యా దాన్ని చేసి చూపించాడు. దానికి కారణం అతని క్రమశిక్షణ, పట్టుదల, లైఫ్ స్టైల్‌లో చేసుకున్న మార్పులే...

ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు దగ్గర ఉంటూ ఎన్నో పాఠాలు నేర్చుకున్న హార్ధిక్ పాండ్యా, తనకంటూ ఓ కొత్త కెప్టెన్సీ స్టైల్‌ని అలవర్చుకున్నాడు. ఎవ్వరినీ కాపీ చేయకపోవడమే హార్ధిక్ పాండ్యా సక్సెస్‌కి కారణం...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ సబా కరీం.. 

ఐపీఎల్ 2022 సీజన్ విజయంతో ఐర్లాండ్‌లో పర్యటించే భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించే సువర్ణావకాశాన్ని దక్కించుకున్నాడు హార్ధిక్ పాండ్యా. కెఎల్ రాహుల్ గాయపడడం, రిషబ్ పంత్ ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లడంతో హార్ధిక్ పాండ్యాకి టీమిండియా కెప్టెన్సీ దక్కింది...

గత ఏడాది కాలంలో టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న ఏడో ప్లేయర్ హార్ధిక్ పాండ్యా. లంక టూర్‌లో శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించగా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత అజింకా రహానే, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, రిషబ్ పంత్.. టీమిండియా కెప్టెన్లుగా వ్యవహరించారు... 

click me!