ది హండ్రెడ్ లీగ్‌ని అలా మార్చేయండి, ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ బతకాలంటే అదొక్కటే మార్గం...

Published : Jan 01, 2022, 05:39 PM IST

2021 ఫ్రిబవరిలో భారత పర్యటనకు వచ్చినప్పటి నుంచి సరైన విజయాలు అందుకోలేకపోతోంది ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు. వరుస పరాజయాలతో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ లీగ్‌లో ఏడో స్థానానికి పడిపోయింది...

PREV
112
ది హండ్రెడ్ లీగ్‌ని అలా మార్చేయండి, ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ బతకాలంటే అదొక్కటే మార్గం...

టీమిండియాతో భారత్‌లో జరిగిన తొలి టెస్టు నెగ్గిన ఇంగ్లాండ్ టీమ్, ఆ తర్వాత వరుసగా మూడు టెస్టుల్లోనూ ఓడి, 3-1 తేడాతో సిరీస్ కోల్పోయింది...

212

ఆ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 1-0 తేడాతో కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు, భారత జట్టుతో జరిగిన నాలుగు టెస్టుల్లోనూ రెండింట్లో ఓడింది...

312

మొదటి టెస్టులో వర్షం కారణంగా ఓటమి నుంచి గట్టెక్కిన ఇంగ్లాండ్ టీమ్, లీడ్స్ టెస్టులో విజయాన్ని అందుకుంది... ఈ 2021-23 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇంగ్లాండ్‌కి దక్కిన ఒకే ఒక్క విజయం ఇదే...

412

యాషెస్ సిరీస్‌లో మొదటి మూడు టెస్టుల్లో చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్ జట్టు, 3-0 తేడాతో సిరీస్ కోల్పోయింది. ఓడిపోవడం కంటే, ఓడిన విధానంపైనే తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి...

512

హోరాహోరీ మ్యాచులు చూడొచ్చని భావించిన యాషెస్ సిరీస్, వార్ వన్‌సైడ్ అన్నట్టుగా ఆసీస్ ఆధిపత్యం చూపిస్తుంటే, ఇంగ్లాండ్ కనీస పోరాటం లేకుండా చేతులెత్తేస్తోంది...

612

‘ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్‌ని బతికించాలంటే బలమైన ఫస్ట్ క్లాస్ దేశవాళీ టోర్నీలను నిర్వహించాలి. ఇప్పటికే ఇంగ్లాండ్‌ కౌంటీల రూపంలో అలాంటి దేశవాళీ టోర్నీలు ఉన్నాయి...

712

అయినా జట్టుకి అవసరమైన ప్లేయర్లను కౌంటీ క్లబ్‌లు అందించలేకపోతున్నాయి. కాబట్టి ది హండ్రెడ్‌లా ఫ్రాంచైజీలతో నిండిన ఫస్ట్ క్లాస్ పోటీలు తీసుకొస్తే బెటర్...

812

ఫ్రాంఛైజీ క్రికెట్‌లో గెలవాలనే కసి, పట్టుదల ఆటగాళ్లలో పెరుగుతాయి. కాబట్టి కౌంటీ ఛాంపియన్‌షిప్‌లా నిరసంగా, చప్పగా కాకుండా జట్టుకి కావాల్సిన సత్తా ఉన్న టెస్టు ప్లేయర్లను తయారుచేయడానికి అవకాశం దొరుకుతుంది...

912

నేను ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే సమయంలో ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిన్ మ్యాచులు టెస్టు మ్యాచుల్లా ఉండేవి. ప్రతీ మ్యాచ్ ఎంతో కఠినంగా ఉండేది...

1012

అందుకే ప్రపంచానికి కావాల్సిన వరల్డ్ క్లాస్ ప్లేయర్లు, ఇంగ్లాండ్ కౌంటీల నుంచి తయారయ్యారు. వీరేంద్ర సెహ్వాగ్, బ్రాడ్ హాడ్, పాల్ నిక్సన్ వంటి దిగ్గజాలు కౌంటీలు ఆడేవాళ్లు...

1112

అయితే ఇప్పుడు కౌంటీ క్రికెట్ స్థాయి దారుణంగా పడిపోయింది. కౌంటీ మ్యాచులు చాలా బోరింగ్‌గా సాగుతున్నాయి... 

1212

చాలామంది క్రికెటర్లు టీ20 లీగ్‌లు ఆడడంలో పెట్టిన శ్రద్ధ, ఆసక్తి... కౌంటీల్లో చూపించడం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, కెప్టెన్ కేవిన్ పీటర్సన్..

click me!

Recommended Stories