వన్డే, టీ20, టెస్టు.. మూడు ఫార్మాట్లలో నెం.1 టీమ్‌గా టీమిండియా! ఆసీస్‌పై తొలి వన్డే విజయంతో...

First Published | Sep 22, 2023, 10:17 PM IST

టీమిండియా, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంకుని అధిగమించింది. ఏ ఒక్క ఫార్మాట్‌లోనో కాదు, టెస్టు, టీ20... తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1 టీమ్‌గా భారత జట్టు... అగ్రస్థానాన నిలిచింది..

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా, ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి పడిపోయింది. 115 పాయింట్లతో పాకిస్తాన్‌ టాప్‌లో ఉంటే, భారత జట్టు కూడా 115 పాయింట్లతో రెండో స్థానంలో ఉండింది. 

KL Rahul

ఆస్ట్రేలియాతో తొలి వన్డే విజయంతో భారత జట్టు ఖాతాలో మరో పాయింట్ చేరింది. దీంతో టీమిండియా 116 పాయింట్లతో టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లింది. 

Latest Videos


Shubman_Ruturaj

2014 ఆగస్టులో సౌతాఫ్రికా, మూడు ఫార్మాట్లలో నెం.1 టీమ్‌గా నిలిచింది. సఫారీ జట్టు తర్వాత మూడు ఫార్మాట్లలో ఒకేసారి నెం.1 టీమ్‌గా నిలిచిన జట్టు టీమిండియానే.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్లు కూడా ఆధిపత్యం కొనసాగిస్తున్నారు...

టెస్టుల్లో నెం.1 బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుంటే, మహ్మద్ సిరాజ్, నెం.1 వన్డే బౌలర్‌గా ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ కొన్ని నెలలుగా నెం.1 టీ20 బ్యాట్స్‌మెన్ ప్లేస్‌లో తిష్టవేసుకుని కూర్చున్నాడు..
 

రవీంద్ర జడేజా, టెస్టుల్లో నెం.1 ఆల్‌రౌండర్‌గా కొనసాగుతుంటే, రవిచంద్రన్ అశ్విన్ నెం.2లో ఉన్నాడు. వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న శుబ్‌మన్ గిల్, ఆసీస్‌తో రెండో వన్డేలో 50+ స్కోరు చేస్తే చాలు.. బాబర్ ఆజమ్‌ని వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్తాడు..

click me!