INDvsAUS: అయినా తీరు మారలేదు... మూడో వన్డేలో టాపార్డర్ విఫలం... భారీ స్కోరు కష్టమే...

First Published Dec 2, 2020, 11:23 AM IST

INDvAUS: మొదటి రెండు వన్డేల్లో టాస్ ఓడి, ప్రత్యర్థికి భారీ స్కోరు అప్పగించిన టీమిండియా... ఎట్టకేలకు మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కి అనుకూలించే పిచ్‌పై భారీ స్కోరు చేసి, ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేయాలనుకున్న విరాట్ కోహ్లీ వ్యూహం ఫలించలేదు. కొత్త బౌలర్లతో బరిలో దిగిన ఆస్ట్రేలియా, భారత టాపార్డర్‌ను తక్కువ స్కోరుకే పెవిలియన్ చేర్చింది...

దూకుడుగా ఆడే మయాంక్ అగర్వాల్ స్థానంలో జట్టులోకి వచ్చిన శుబ్‌మన్ గిల్‌తో ఓపెనింగ్ చేసిన శిఖర్ ధావన్... కేవలం 16 పరుగులకే పెవిలియన్ చేరాడు.
undefined
మొదటి రెండు వన్డేల్లో మొదటి వికెట్‌కి 50+ భాగస్వామ్యం రాగా... మూడో వన్డేలో 26 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు. హజల్‌వుడ్ వేసిన మొదటి ఓవర్‌లో ఒక్క పరుగు కూడా తీయలేకపోయిన ధావన్, కొత్త బౌలర్ అబ్బాట్ బౌలింగ్‌లో అగర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
undefined
ఆ తర్వాత గిల్‌, కోహ్లీ కలిసి రెండో వికెట్‌కి 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 39 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసిన గిల్, అగర్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.
undefined
టూ డౌన్‌లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 21 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసి జంపా బౌలింగ్‌లో వెనుదిరిగాడు...
undefined
కెఎల్ రాహుల్ 11 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ కావడంతో 123 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది టీమిండియా...
undefined
విరాట్ కోహ్లీ 64 బంతుల్లో 4 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో 12 వేల మైలురాయిని చేరుకున్న కోహ్లీకి ఇది 60వ హాఫ్ సెంచరీ.
undefined
78 బంతుల్లో 5 ఫోర్లతో 63 పరుగులు చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ... మరోసారి హజల్‌వుడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
undefined
32 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది.
undefined
రన్‌రేటు 5 కంటే తక్కువే. మొదటి రెండు వన్డేల్లో ఆస్ట్రేలియా 7.5 కంటే ఎక్కువ రన్‌రేటుతో పరుగులు చేసిన విషయం తెలిసిందే.
undefined
ఇప్పటికే బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరడంతో హార్ధిక్ పాండ్యా, టెయిలెండర్లతో కలిసి ఏ మాత్రం పరుగులు రాబట్టగలుగుతాడనేదానిపైనే భారత స్కోరు ఆధారపడి ఉంది.
undefined
click me!