వాడొక్కడూ ఉండి ఉంటేనా, ఆస్ట్రేలియాకి చుక్కులు చూపించేవాడు! రిషబ్ పంత్‌ని మిస్ అవుతున్న టీమిండియా...

Published : Mar 02, 2023, 04:04 PM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో టీమిండియా మొదటి రెండు టెస్టుల్లో గెలిచి తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. అయితే తొలి రెండు టెస్టుల్లో కూడా భారత జట్టు బ్యాటర్లు, ఆస్ట్రేలియా బౌలర్లను డామినేట్ చేసింది లేదు. ఏదో బౌలర్ల పుణ్యమాని, టీమిండియా గెలవగలిగింది అంతే...

PREV
17
వాడొక్కడూ ఉండి ఉంటేనా, ఆస్ట్రేలియాకి చుక్కులు చూపించేవాడు! రిషబ్ పంత్‌ని మిస్ అవుతున్న టీమిండియా...
Nathan Lyon

ఆస్ట్రేలియా స్పిన్నర్లు నాథన్ లియాన్, మ్యాట్ కుహ్నేమన్, టాడ్ ముర్ఫీ బౌలింగ్‌ని ఫేస్ చేయడానికి భారత బ్యాటర్లు తెగ ఇబ్బంది పడుతున్నారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్‌తో పాటు విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా, శ్రేయాస్ అయ్యర్ కూడా స్పిన్ బౌలర్లను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు...

27
Lyon vs Rohit

యంగ్ బ్యాటర్ శ్రీకర్ భరత్ కూడా ఆసీస్ స్పిన్ బౌలింగ్‌ని ఫేస్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. ఢిల్లీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా 22 పరుగులు చేసి మెప్పించిన శ్రీకర్ భరత్, మూడో టెస్టులో 3 పరుగులు చేసి నాథన్ లియాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..

37
Rishabh Pant

విరాట్ కోహ్లీ అవుటైన తర్వాత రిషబ్ పంత్ పేరు ట్రెండింగ్‌లో కనిపించింది. దీనికి కారణం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 సీజన్2లో సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్‌కి ఆస్ట్రేలియాలోనే చుక్కలు చూపించాడు రిషబ్ పంత్... 

47

ఫ్రంట్ ఫుట్‌కి వచ్చి ఎంతో ఈజీగా సిక్సర్లు బాదాడు. సుదీర్ఘ అనుభవం ఉన్న విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా పరుగులు చేయడానికి ఇబ్బందిపడిన చోట, కుర్రాడు రిషబ్ పంత్ బౌండరీల మోత మోగించాడు. రిషబ్ పంత్ అలా ఆడుతుంటే ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు ఆసీస్ బౌలర్లు.. ఇప్పుడు టీమిండియా మిస్ అవుతోంది రిషబ్ పంత్‌లాంటి దూకుడైన బ్యాటర్‌నే..
 

57

ప్రస్తుతం టీమిండియాలో ఉన్న ప్లేయర్లలో రిషబ్ పంత్‌లా దూకుడుగా బ్యాటింగ్ చేయగల ఒకే ఒక్క బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. అయితే యాదవ్ వికెట్ కీపర్ కాదు. అలా అయ్యి ఉంటే సూర్యకి టీమ్‌లో చోటు కన్ఫార్మ్ అయ్యి ఉండేది. శ్రేయాస్ అయ్యర్ కోసం సూర్యకుమార్ యాదవ్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టింది టీమిండియా...

67
Matthew Kuhnemann

పృథ్వీ షా కూడా రిషబ్ పంత్‌ మాదిరిగానే బజ్‌బాల్ కాన్సెప్ట్‌తో బాదే క్రికెటర్. అయితే ఆడిలైడ్ టెస్టు తర్వాత అతన్ని పూర్తిగా పట్టించుకోవడమే మానేసింది టీమిండియా. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ పూర్తిగా కోలుకోవడానికి ఏడాదికి పైగా సమయం పడుతుంది. 

77
prithvi shaw

స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌లో టీమిండియా మిగిలిన రెండు టెస్టుల్లో ఒక్కటి డ్రా చేసుకున్నా, సిరీస్ గెలిచేస్తుంది. అసలు సమస్య ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనే. ఫైనల్ మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ లేని లోటు, టీమిండియాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది... ఎంతటి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది...

Read more Photos on
click me!

Recommended Stories