Malti Chahar: టీమిండియా క్రికెటర్, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ సభ్యుడు దీపక్ చాహర్ సోదరి మాలతి చాహర్ బాలీవుడ్ లోకి కాలుమోపనుంది. ఆమె నటించబోతున్న తొలి సినిమా చిత్రీకరణ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు సమాచారం.
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడే దీపక్ చాహర్ సోదరి మాలతి చాహర్ సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటిస్తున్న తొలి బాలీవుడ్ చిత్రం షూటింగ్ కూడా సగం కంప్లీట్ అయింది.
27
‘ఇష్క్ పష్మినా’ అనే చిత్రంతో మాలతి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఫీల్ గెడ్ లవ్ స్టోరీ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో భావిన్ భానుషాలి హీరోగా నటిస్తున్నాడు.
37
భావిన్.. ‘దె దె ప్యార్ దే’, ‘వెల్లపంటి’, ‘ఏ.ఐ.షా మై వర్చువల్ గర్ల్ ఫ్రెండ్’ ద్వారా అటు బుల్లితెర ఇటు వెండితెర అభిమానులకు సుపరిచితుడే. కానీ హీరోగా అతడికి ఇదే తొలి చిత్రం.
47
తన బాలీవుడ్ ఎంట్రీ పై మాలతి ఉత్సాహంగా ఉంది. ఈ చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా మాలతి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నేను భాగమవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
57
భావిన్ మంచి కోస్టార్. మా డైరెక్టర్ అరవింద్ నా పై నమ్మకముంచి నన్ను ఈ పాత్ర కోసం సజెస్ట్ చేశారు. ఈ చిత్రంలోని టెక్నీషియన్స్ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు..’ అని తెలిపింది.
67
అరవింద్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. లవ్ స్టోరీ ప్రధానంశంగా రూపొందించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కూడా చాలావరకు పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని పాండే తెలిపాడు.
77
ఇదిలాఉండగా అక్క బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుండగా సోదరుడు దీపర్ చాహర్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. జూన్ 1న అతడు తన గర్ల్ ఫ్రెండ్ జయా భరద్వాజ్ ను వివాహం చేసుకోబోతున్నాడు. దీపక్ సోదరుడు రాహుల్ చాహర్ ఇప్పటికే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.