Jasprit Bumrah: టీమిండియా పేసర్, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. తద్వారా ఐపీఎల్ లో ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్ అయ్యాడు.
ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో 3 వికెట్లు పడగొట్టడం ద్వారా అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ లో వరుసగా ఏడో ఏడాది కూడా 15 వికెట్లు తీసుకున్న బౌలర్ గా రికార్డులకెక్కాడు.
26
శనివారం వాంఖెడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో ముగిసిన మ్యాచ్ లో బుమ్రా ఈ ఘనత సాధించాడు. ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా బుమ్రా.. 3 వికెట్లు తీశాడు. ఢిల్లీ ప్రధాన బ్యాటర్లైన మిచెల్ మార్ష్, పృథ్వీ షా, రొవ్మెన్ పావెల్ లను పెవిలియన్ కు చేర్చాడు.
36
తద్వారా బుమ్రా.. ఐపీఎల్ చరిత్రలో వరుసగా ఏడో సీజన్ లో కూడా 15 ప్లస్ వికెట్లు సాధించిన రెండో బౌలర్ అయ్యాడు. అంతకుముందు ఈ ఘనత కూడా ముంబై ఇండియన్స్ బౌలర్ లసిత్ మలింగ (శ్రీలంక) పేరిట ఉండేది.
46
అయితే భారత్ తరఫున మాత్రం ఈ జాబితాలో బుమ్రానే ఫస్ట్ బౌలర్. 2015 నుంచి బుమ్రా.. ప్రతి సీజన్ లో 15 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీస్తున్నాడు. ఈ సీజన్ లో బుమ్రా.. తొలుత మ్యాచులలో వికెట్లు తీయకున్నా పొదుపుగా బౌలింగ్ చేశాడు.
56
అతడికి తోడుగా మెరుగ్గా బౌలింగ్ చేసే బౌలర్ కూడా లేకపోవడం ముంబైకి శాపంగా మారింది. ఫలితంగా ముంబై కీలక మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకోవడమే గాక మొత్తంగా సీజన్ లో ఆఖరి స్థానంలో నిలిచింది.
66
ఇక ఢిల్లీ-ముంబై మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం ముంబై.. 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసి విజయం సాధించింది.