రహానే రనౌట్... టిమ్ పైన్ విషయంలో నాటౌట్... ఆస్ట్రేలియాకి అనుకూలంగా థర్డ్ అంపైర్ నిర్ణయాలు...

First Published Dec 28, 2020, 6:35 AM IST

మొదటి టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీని రనౌట్ చేసిన అజింకా రహానేకి, రనౌట్‌ను తిరిగి అప్పగించేశాడు భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. వికెట్ల మధ్యలో సునామీ వేగంతో పరుగెత్తే జడ్డూ, టెస్టు మ్యాచ్‌లో  ఓ క్విక్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. అయితే లబుషేన్ వేగంగా బంతిని అందుకోవడంతో రహానే వికెట్ కోల్పోయింది భారత జట్టు. తొలి టెస్టులో కెప్టెన్‌ కోహ్లీ రనౌట్‌ కాగా, ఈ మ్యాచ్‌లోనూ కెప్టెన్‌ రనౌట్ రూపంలో అవుట్ అయ్యాడు.

223 బంతుల్లో 12 ఫోర్లతో 112 పరుగులు చేసిన అజింకా రహానే... టెస్టు కెరీర్‌లో తొలిసారి రనౌట్ అయ్యాడు...
undefined
అయితే అజింకా రహానే రనౌట్‌పై కూడా వివాదం రేగింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో లైన్ మీద బ్యాటు ఉందనే కారణంతో టిమ్ పైన్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు థర్డ్ అంపైర్.
undefined
నేటి ఇన్నింగ్స్‌లో అజింకా రహానే బ్యాటు కూడా లైన్ మీదే ఉన్నప్పటికీ అవుట్‌గా ప్రకటించాడు. దీంతో థర్డ్ అంపైర్ ఆసీస్‌కు అనుకూలంగా వ్యవహారిస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి.
undefined
భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా ఈ విషయంపై స్పందించాడు. ‘మరో యాంగిల్ నుంచి చూడాలంటూ’ ట్వీట్ చేశాడు...
undefined
ఐదో వికెట్‌కి రవీంద్ర జడేజా, అజింకా రహానే కలిసి 121 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు...
undefined
టెస్టుల్లో సెంచరీ పూర్తిచేసుకున్న తర్వాత రనౌట్ అయిన మూడో భారత కెప్టెన్‌గా అజింకా రహానే...ఇంతకుముందు 1951లో విజయ్ హాజరే, 2006లో రాహుల్ ద్రావిడ్... టెస్టు సెంచరీల తర్వాత రనౌట్ అయ్యారు.
undefined
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియాపై అత్యధిక స్కోరు చేసిన భారత కెప్టెన్‌గా సచిన్ రికార్డును 4 పరుగుల తేడాతో మిస్ అయ్యాడు అజింకా రహానే.సచిన్ టెండూల్కర్ 116 పరుగులు చేయగా, రహానే 112 పరుగులకి దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు.
undefined
రహానే అవుటైన తర్వాత టెస్టుల్లో 15వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు రవీంద్ర జడేజా...
undefined
2012లో టెస్టు ఎంట్రీ ఇచ్చిన జడేజా, మొదటి నాలుగేళల్లో రెండే హాఫ్ సెంచరీలు చేయగా, గత నాలుగేళ్లలో 14 హాఫ్ సెంచరీలు చేశాడు.
undefined
బాక్సింగ్ డే టెస్టులో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి హాఫ్ సెంచరీ బాదిన రెండో భారత ప్లేయర్‌గా నిలిచాడు రవీంద్ర జడేజా. ఇంతకుముందు 1985లో కపిల్ దేవ్ ఈ ఫీట్ సాధించాడు.
undefined
159 బంతుల్లో 3 ఫోర్లతో 57 పరుగులు చేసిన రవీంద్ర జడేజా... మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ప్యాట్ కమ్మిన్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
undefined
306 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది టీమిండియా. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో జడేజా అవుట్ కావడం ఇదే తొలిసారి.
undefined
click me!