INDvsENG: రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్... ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం...

Published : Feb 15, 2021, 03:51 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, అద్భుత సెంచరీతో భారత జట్టు భారీ స్కోరు చేయగలిగింది. బ్యాటుకి కష్టసాధ్యమైన పిచ్‌పై తేలిగ్గా బౌండరీలు కొడుతూ, చారిత్రక సెంచరీ పూర్తి చేసుకున్నాడు రవిచంద్రన్ అశ్విన్. చెన్నై పిచ్‌పై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్న సమయంలో అదే పిచ్‌పై అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు అశ్విన్. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 286 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ జట్టు టార్గెట్ 481 పరుగులు. 

PREV
116
INDvsENG: రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్... ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం...

ఓ వైపు వికెట్లు పడుతున్నా, స్ట్రైయిక్ రొటేట్ చేస్తూ చారిత్రాత్మక శతకాన్ని నమోదుచేశాడు. 134 బంతుల్లో 14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకున్న రవిచంద్రన్ అశ్విన్‌కి ఇది టెస్టుల్లో ఐదో సెంచరీ... 

216

తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ బాది టాప్ స్కోరర్‌గానూ నిలిచాడు. రవిచంద్రన్ అశ్విన్ కెరీర్‌లో ఐదు వికెట్లు తీసి, సెంచరీ బాదడం ఇది మూడోసారి.

316

2016లో వెస్టిండీస్‌పై చివరిసారిగా టెస్టు సెంచరీ చేసిన రవిచంద్రన్ అశ్విన్, ఐదేళ్ల తర్వాత శతకాన్ని నమోదు చేశాడు. అశ్విన్ ఇంతకుముందు చేసిన టెస్టు సెంచరీలన్నీ విండీస్‌పైనే చేసినవి కాగా, తొలిసారి ఇంగ్లాండ్‌పై శతకం బాదాడు అశ్విన్.

416

237 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయినప్పుడు 80ల్లో ఉన్న రవిచంద్రన్ అశ్విన్, సిరాజ్‌తో కలిసి 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సెంచరీకి ముందు 31 పరుగుల భాగస్వామ్యంలో సిరాజ్ చేసింది కేవలం ఒకే ఒక్క పరుగు. 

516

148 బంతుల్లో 14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 106 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్, ఓల్లీ స్టోన్ బౌలింగ్‌లో బౌల్డ్ అవ్వడంతో భారత ఇన్నింగ్స్‌ 286 పరుగుల వద్ద తెరపడింది. 

616

మహ్మద్ సిరాజ్ 21 బంతుల్లో 2 సిక్సర్లతో 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సిరాజ్, అశ్విన్ కలిసి ఆఖరి వికెట్‌కి 55 బంతుల్లో 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. 

716

తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 195 పరుగుల ఆధిక్యంతో కలిపి ఇంగ్లాండ్ ముందు 481 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 

816

ఓవర్‌నైట్ స్కోర్ 54/1 వద్ద మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, తొలి సెషన్‌లో ఏకంగా ఐదు వికెట్లు కోల్పోయింది. 7 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా రనౌట్ కాగా, 26 పరుగులు చేసిన రోహిత్ శర్మ స్టంపౌట్ అయ్యాడు....

916

ఫస్ట్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో నాటౌట్‌గా నిలిచిన రిషబ్ పంత్, బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకొచ్చాుడ. అయితే 11 బంతుల్లో 8 పరుగులు చేసిన పంత్‌ను జాక్ లీచ్ అవుట్ చేయడంతో 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఆ తర్వాత అజింకా రహానే కూడా 10 పరుగులకే పెవిలియన్ చేరగా అక్షర్ పటేల్ 7 పరుగులు చేశాడు.

1016

106 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియాను కెప్టెన్ విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ కలిసి ఆదుకున్నారు. ఏడో వికెట్‌కి 90 పరుగుల భాగస్వామ్యం జోడించిన ఈ ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు...

1116

చెన్నైలో ఏడో వికెట్‌కి ఇది మూడో అత్యధిక భాగస్వామ్యం. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయి, రెండో ఇన్నింగ్స్‌లో 50+ స్కోరు చేసిన ఏకైక భారత కెప్టెన్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. 

1216

 ఇంతకుముందు 2017లో శ్రీలంకపై తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయి, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదాడు కోహ్లీ. 

1316

149 బంతుల్లో 7 ఫోర్లతో 62 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, మొయిన్ ఆలీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 

1416

కుల్దీప్ యాదవ్ 3 పరుగులకే మొయిన్ ఆలీ బౌలింగ్‌లోనే అవుట్ కావడంతో 210 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది టీమిండియా.

1516

అయితే ఇషాంత్ శర్మతో కలిపి తొమ్మిదో వికెట్‌కి 27 పరుగులు జోడించాడు రవిచంద్రన్ అశ్విన్. 9 ఓవర్లు పాటు సాగిన ఈ భాగస్వామ్యం, 7 పరుగులు చేసిన ఇషాంత్ శర్మ, జాక్ లీచ్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో ముగిసింది. 

1616

ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్ లీచ్ నాలుగు, మొయిన్ ఆలీ నాలుగు వికెట్లు తీయగా... ఓల్లీ స్టోన్‌కి ఓ వికెట్ దక్కింది. 

click me!

Recommended Stories