ఐపీఎల్ వేలానికి ముందు అర్జున్ టెండూల్కర్ అద్భుత ప్రదర్శన... ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాది...

Published : Feb 15, 2021, 10:51 AM IST

ఎప్పుడు ఆడినా, ఆడకపోయినా ఐపీఎల్ వేలానికి ఒక్క మంచి పర్ఫామెన్స్ ఇస్తే, కోట్లు కొట్టేయొచ్చు. టీమిండియాలో చోటు కోల్పోయినా, ఐపీఎల్‌లో కోట్లు కొల్లగొట్టిన చాలామంది ప్లేయర్లు చేసింది ఇదే. ఈ విషయం ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్‌ కొడుక్కి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియకపోవచ్చు. అందుకేనేమో సరిగ్గా మరో ఐదు రోజుల్లో ఐపీఎల్ 2021 మినీ వేలం జరుగుతుందనగా కెరీర్ బెస్ట్ ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు అర్జున్ టెండూల్కర్.

PREV
18
ఐపీఎల్ వేలానికి ముందు అర్జున్ టెండూల్కర్ అద్భుత ప్రదర్శన... ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాది...

విజయ్ హాజరే ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన అర్జున్ టెండూల్కర్... 73వ పోలీస్ ఇన్విటేషన్ షీల్డ్ టోర్నీలో ఆడుతున్నాడు. గ్రూప్ ఏలో ఏంఐజీ క్రికెట్ క్లబ్ తరుపున ఆడిన అర్జున్ టెండూల్కర్, మొదటి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

28

31 బంతుల్లో 77 పరుగులు చేసిన అర్జున్ టెండూల్కర్, ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాది సంచలనం క్రియేట్ చేశాడు. అర్జున్ టెండూల్కర్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. 

38

అంతేకాకుండా బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టి, ఈ మధ్యకాలంలోనే సంచలన ప్రదర్శన కనబర్చాడు. అర్జున్ టెండూల్కర్‌తో పాటు మరో ఇద్దరు బ్యాట్స్‌మెన్ రాణించడంతో ఎంఐజీ జట్టు 45 ఓవర్లలో 385 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్యచేధనలో ఇస్లాం జింఖానా జట్టు 191 పరుగులకు ఆలౌట్ అయ్యి, 194 పరుగుల భారీ తేడాతో ఓడింది.

48

అయితే సరిగ్గా ఐపీఎల్ 2021 మినీ వేలానికి ముందు అర్జున్ టెండూల్కర్ నుంచి అదిరిపోయే పర్ఫామెన్స్ రావడంపై క్రికెట్ ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు... ఈ మధ్యకాలంలో అర్జున్ టెండూల్కర్ నుంచి ఇలాంటి ప్రదర్శన లేకపోవడమే వారి అనుమానాలకు కారణం. 

58

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో పెద్దగా పర్పామెన్స్ ఇవ్వకపోయినా ఐపీఎల్ 2021 మినీ వేలం షార్ట్ లిస్టులో చోటు దక్కించుకున్నాడు అర్జున్ టెండూల్కర్... వేలంలోకి వచ్చాడు కాబట్టి కచ్ఛితంగా అతన్ని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంది.

68

అయితే పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వకపోయినా సచిన్ టెండూల్కర్ వారసుడు కావడం వల్లే కొనుగోలు చేశారనే ఆరోపణలు, డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌పైన రావచ్చు... 
అదీకాకుండా ముంబై తప్పు మరో జట్టు అతన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడకపోతే... బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకే అర్జున్ టెండూల్కర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది... 

78

అందుకే మినీ వేలానికి ముందు ఇలాంటి తప్పులు జరగకుండా పక్కా ప్లానింగ్‌తో అర్జున్ టెండూల్కర్‌ని ఓ మినీ టోర్నీ ఆడించారని అనుమానిస్తున్నారు అభిమానులు.

88

ఈ మ్యాచ్ ప్రదర్శన కారణంగా అర్జున్ టెండూల్కర్‌ను కొనుగోలు చేసినా సచిన్ కొడుకు అయినందువల్లే కొన్నారనే విమర్శలు రావు, అదీకాకుండా ఈ పర్ఫామెన్స్ చూసిన మిగిలిన ప్రాంఛైజీలు అతన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడొచ్చు. దాంతో సచిన్ వారసుడికి బేస్ ప్రైజ్ కంటే ఎక్కువే దొరుకుతుంది. పోటీ పెరిగితే కోట్లల్లో కొల్లగొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

click me!

Recommended Stories