క్రికెట్‌కి ఇంకా రిటైర్మెంట్ ప్రకటించకముందే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, బెంగాల్‌లో మంత్రిగా పదవీ బాధ్యతలు కూడా స్వీకరించాడు మనోజ్ తివారి. పశ్చిమ బెంగాల్‌లోని షిబ్‌పూర్‌లో భారీ మెజారిటీతో విజయం సాధించిన క్రికెటర్ మనోజ్ తివారి, ఐపీఎల్‌ను రెగ్యూలర్‌గా ఫాలో అవుతున్నాడు...
ఐపీఎల్ 2022 మెగా వేలానికి కూడా రిజిస్టర్ చేయించుకున్నాడు మనోజ్ తివారి. అయితే షార్ట్ లిస్టులో మనోజ్ పేరు లేకపోవడంతో వేలంలో ఈ మంత్రిగారి పేరు వినిపించలేదు...
28
ఇంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్, పంజాబ్ కింగ్స్ వంటి జట్లకి ఆడిన మనోజ్ తివారి... బెంగాల్ రాష్ట్ర యూత్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్‌గా ఉన్నాడు...
38
టీమిండియా తరుపున 12 వన్డేలు, 3 టీ20 మ్యాచులు ఆడిన మనోజ్ తివారి, వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో సెంచరీ కూడా చేశాడు. బౌలింగ్‌లోనూ చెలరేగి విండీస్‌పై 4 వికెట్లు తీశాడు...
48
2015 జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో కనిపించిన మనోజ్ తివారిని సెలక్టర్లు పెద్దగా పట్టించుకోలేదు. 2018 తర్వాత ఐపీఎల్‌లోనూ తివారికి పెద్దగా అవకాశాలు రాలేదు...
58
ఐపీఎల్‌లో 98 మ్యాచులు ఆడి 7 హాఫ్ సెంచరీలతో 1695 పరుగులు చేశాడు మనోజ్ తివారి. అత్యధిక స్కోరు 75 నాటౌట్...
68
లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్ల ఆధిపత్యం సాగింది. దీపక్ హుడా తప్ప పెద్దగా ఎవ్వరూ రాణించలేకపోయారు. రాహుల్ 68 పరుగులు చేసినా 50 బంతులు వాడుకున్నాడు...
78
లక్ష్యఛేదనలో రాహుల్ త్రిపాఠి 44 పరుగులు చేయడం మినహా మిగిలిన ఎవ్వరూ రాణించకపోవడంతో 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది సన్‌రైజర్స్ హైదరాబాద్...
88
ఈ మ్యాచ్ తర్వాత ‘కావాలంటే నేను ఇప్పటికీ అందుబాటులో ఉన్నా...’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు మనోజ్ తివారి. ఇన్‌డైరెక్టుగా వీళ్ల కంటే తాను బాగా ఆడతానని చెప్పుకొచ్చాడు తివారి...