TATA IPL2022 - CSK vs LSG: టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని తన కెరీర్ లో ఎన్నో రికార్డులను సాధించాడు. వ్యక్తిగతంగానే గాక జట్టు తరఫున కూడా టీమిండియాను మూడు ఫార్మాట్లలో ఛాంపియన్ గా నిలిపిన ధోని.. తాజాగా మరో రికార్డుకు చేరువయ్యాడు.
టీ20 క్రికెట్ లో ధోని మరో 15 పరుగులు చేస్తే అతడు పొట్టి ఫార్మాట్ లో 7 వేల పరుగులు చేసిన ఐదో భారత క్రికెటర్ గా రికార్డులకెక్కుతాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగబోయే మ్యాచులో ధోని ఈ రికార్డు సాధిస్తాడని అతడి అభిమానులు ఆశిస్తున్నారు.
27
ఫ్రాంచైజీలు, జాతీయ జట్టుకు కలిపి టీ20లలో 7వేల పరుగుల మైలురాయిని దాటిన వారిలో గతంలో విరాట్ కోహ్లి (10,326 పరుగులు..), రోహిత్ శర్మ (9,936), శిఖర్ ధావన్ (8,818), రాబిన్ ఊతప్ప (7,070) ధోనికంటే ముందున్నారు.
37
ప్రస్తుతం ధోని 6,985 పరుగులతో ఈ నలుగురి తర్వాత స్థానంలో ఉన్నాడు. ఎల్ఎస్జీ తో మ్యాచులో ధోని 15 పరుగులు చేస్తే ఈ ఫీట్ సాధించిన ఐదో భారత బ్యాటర్ గా నిలువనున్నాడు. కాగా టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన వారి జాబితాలో విండీస్ వీరుడు క్రిస్ గేల్.. 14,562 పరుగులతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.
47
ఇదిలాఉండగా.. ఐపీఎల్-15 ప్రారంభ మ్యాచులో కోల్కతా తో జరిగిన గేమ్ లో ధోని హాఫ్ సెంచరీతో రాణించిన విషయం తెలిసిందే. 61 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సీఎస్కేను ధోని ఆదుకున్నాడు.
57
జడ్డూ తో కలిసి 70 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించిన ధోని.. వంద కూడా దాటుతుందా అన్న చెన్నై స్కోరును.. 131 పరుగులకు చేర్చాడు. ఆఖరి మూడు ఓవర్లలో విశ్వరూపం చూపిస్తూ.. 38 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
67
అయితే స్వల్ప లక్ష్య ఛేదనలో కేకేఆర్.. 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచులో డ్వేన్ బ్రావో మూడు వికెట్లతో రాణించినా విజయం మాత్రం కోల్కతానే వరించింది.
77
ఇక ఎల్ఎస్జీ మ్యాచులో ధోనితో పాటు బ్రావోను కూడా ఓ రికార్డు ఊరిస్తున్నది. నేటి మ్యాచులో అతడు ఒక వికెట్ తీస్తే.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం అతడు.. మలింగ (170 వికెట్లు) తో కలిసి సమానంగా ఉన్నాడు.